పోలింగ్ కేంద్రంలో మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి హ‌ల్‌చ‌ల్ 

వైయ‌స్ఆర్‌సీపీ జ‌డ్పీటీసీ అభ్య‌ర్థి సుబ్బారెడ్డిపై ప‌చ్చ‌గూండాల దాడి 

వైయ‌స్ఆర్ జిల్లా:  ఉప ఎన్నిక‌ల వేళ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పోలింగ్ కేంద్రంలో హ‌ల్‌చ‌ల్ చేశారు. ఒంటిమిట్ట మండ‌లం చిన్న కొత్తపల్లిలో మంత్రి రాం ప్రసాద్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి ప్ర‌వేశించి వీరంగం సృష్టించారు. ఆయ‌న సమక్షంలో మంత్రి అనుచరుల వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్‌పై చేయి చేసుకున్నారు. ఓట్లు వేయడానికి వ‌చ్చిన వాళ్లపై టీడీపీ శ్రేణులు బెదిరిరింపుల‌కు దిగారు. కట్టెలతో కొడుతున్నారంటూ ఓట‌ర్లు వాపోయారు. ప్రజలతో మాట్లాడేందుకు వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ జడ్పిటిసి అభ్యర్థి సుబ్బారెడ్డిపై ప‌చ్చ‌గూండాలు దాడికి తెగ‌బ‌డ్డారు. అక్క‌డే ఉన్న మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి బూతు పురాణం అందుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పక్క జిల్లా నుంచి ఒంటిమిట్ట వచ్చి మంత్రి రాంప్రసాద్ రెడ్డి వీరంగం సృష్టించ‌డంతో స్థానికులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. పోలింగ్ కేంద్రంలో మంత్రి హ‌ల్‌చ‌ల్ చేస్తున్నా పోలీసులు చోద్యం చూడ‌టం ప‌ట్ల స్థానికులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. 

Back to Top