

















వైయస్ఆర్‌సీపీ నాయకురాలు కాకాణి పూజిత
నెల్లూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని అరెస్టు చేసి జైల్లో ఉంచినంత మాత్రానా ఆయనపై ఉన్న అభిమానాన్ని దూరం చేయలేరని వైయస్ఆర్‌సీపీ నాయకురాలు కాకాణి పూజిత అన్నారు. గురువారం ముత్తుకూరు మండలంలో కాకాణి పూజిత పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. దువ్వూరువారిపాళెంలో వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి ని పూజిత పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..`ప్రజాభిమాన నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వాదం, సర్వేపల్లి నియోజకవర్గ కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు మా కుటుంబంపై మెండుగా ఉన్నాయి. నాన్న మాపై ఉంచిన బాధ్యత సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలను కంటికిరెప్పలా కాపాడుకోవడం. అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపి, మాకు అన్యాయం చేశారని మా కుటుంబానికి సర్వేపల్లి ప్రజలు అండగా నిలుస్తున్నారు. సర్వేపల్లి ప్రజలు ఎక్కడికి వెళ్లినా, నాన్నపై ఉన్న అదే అభిమానం, అదే ఆప్యాయతను నాపై చూపిస్తున్నారు. నాన్నను తమ నాయకుడిగా కాకుండా, తమ కుటుంబసభ్యుడిగా భావిస్తున్నారు. తమ కుటుంబసభ్యుడు తప్పు చేయడనే భావన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలలో బలంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఇకనైనా ఇటువంటి కక్షపూరిత చర్యలు ఆపాలని కోరుతున్నాం` అంటూ పూజిత హితవు పలికారు.