అనంతపురం : రాష్ట్రంలో బీసీలపై దాడి చేస్తే.. ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేనని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. అన్నమయ్య జిల్లా వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయభాస్కర్ ఇంటిపై టీడీపీ అల్లరి మూకలు దాడి చేసి ఆయన్ను గాయపరచడం జరిగిందన్నారు. చుట్టుపక్క ప్రజలు రక్తపు మడుగులో పడి ఉన్న విజయభాస్కర్ ని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందజేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 18 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేక దాడులు చేసిందన్నారు. కృష్ణాజిల్లా చోడవరంలో బీసీ సోదరుల పైన దాడులు జరగడం, ఏలూరు జిల్లా భీమవరంలో పదహారేళ్ల చిన్నారిని కొట్టి చంపడం జరిగిందని, ఆ కన్నతల్లికి బిడ్డను దూరం చేయడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. నిన్నటి రోజున అనంతపురం నగరంలోని సోమనాథ్ నగర్ లో రజక యువకుడు పైన దాడి చేయడం జరిగిందన్నారు. బీసీలకు చట్టసభల్లో అవకాశం కల్పిస్తామని అంటూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత బీసీలను నిర్వీర్యం చేసిందని, బీసీలపై రాష్ట్రంలో అనేక చోట్ల దాడులు జరుగుతూనే ఉన్నారని, కార్యకర్తలు మొదలుకొని నాయకుల వరకు దాడులు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను రోడ్డుపైకి తెచ్చిన ఘనత ఒక్క నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అంటూ ప్రచారాలు చేసిన వారే బీసీలపై దాడులు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల ముందు ప్రశ్నిస్తా అంటూ ప్రగడ్బాలు పలికిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఇంత అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటే నువ్వు ఎక్కడ ప్రశ్నిస్తున్నావో చెప్పాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కక్షపూరిత వాతావరణం నెలకొందని, కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు చేస్తుంటే.. మాకు భారత రాజ్యాంగం అండగా ఉందని తెలియజేశారు. వైయస్ఆర్‌సీపీప్రభుత్వం తెచ్చిన పేదలకు ఉపయోగపడే వ్యవస్థలన్నింటినీ టీడీపీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి పాలన కొనసాగించారని తెలియజేశారు. టీడీపీ ప్రభుత్వం పీపీపీ తో మెడికల్ విద్యను ప్రైవేట్ పరం చేసేందుకు పన్నాగం పన్నిందన్నారు. చట్టసభల్లో బీసీలకు అవకాశాలు కల్పించే దిశగా బీసీ హక్కులను కాపాడుకుంటామని రమేష్ గౌడ్ తెలిపారు. అనంతరం పార్టీ సీఈసీ సభ్యులు సుగుమంచిపల్లి రంగన్న, జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు ఎస్.దేవేంద్రలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కక్షపూరితంగానే బీసీలపై కూటమి ప్రభుత్వం దాడులు చేస్తోందని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం రాష్ట్రంలో బీసీలపై అనేక దాడులు జరుగుతున్నాయని, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పాలు చేస్తున్నరన్నారు. పేదలకు ఉపయోగపడే వ్యవస్థలన్నీ కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ విభాగం సంయుక్త కార్యదర్శి ఎంఏ నవీన్ కుమార్, జిల్లా బీసీ విభాగం ఉపాధ్యక్షులు మాలపాటి శ్రీనివాసులు, నగర బీసీ విభాగం అధ్యక్షులు బోయ లక్ష్మన్న, జిల్లా బీసీ విభాగం కార్యదర్శి బేస్త కోట వెంకటేష్, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి లబ్బే రాఘవ, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి తాడిమర్రి నరేంద్ర, నాయకులు గణేష్, హేమ కిరణ్, అంకె తేజ, బాలాజీ, సత్యమయ్య, హిద్దు తదితరులు పాల్గొన్నారు.