తాడేపల్లి: మోసాలతో, కుంభకోణాలతో చంద్రబాబు అండ్ కో ఆంధ్రప్రదేశ్‌ను అడ్డంగా దోచుకుంటున్నారని.. పైగా గోబెల్స్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి.. పలు అంశాలపై మాట్లాడారు. రైతుల సమస్యలు. ఫీజు రీయింబర్స్‌మెంట్. ఆరోగ్యశ్రీ. సంక్షేమ హాస్టళ్లలో దుర్భర పరిస్థితులు, పిల్లల మరణాలు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో విపక్షం టార్గెట్‌గా వే«ధింపులు. టీటీడీ లడ్డూ వ్యవహారం. పరకామణి కేసుతో పాటు, చంద్రబాబు తనపై మాఫీ చేసుకుంటున్న కేసులపై సుదీర్ఘంగా మాట్లాడిన శ్రీ వైయస్ జగన్. వైయస్ జగన్ ప్రెస్‌మీట్. ముఖ్యాంశాలు: వ్యవసాయం దండగ అన్నట్లు ప్రభుత్వ వ్యవహారం: – రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్లుగా ఉంది. దేశమంతా ఇటు వైపు చూడాల్సిన పరిస్థితి ఉంది. వ్యవసాయంపై రాష్ట్రంలో 62 శాతం ఆధారపడి ఉన్నారు. ఏ ప్రభుత్వమైనా రైతులను సంతోషపెట్టాలి. అలా వ్యవసాయాన్ని పండగలా చేయాలి. రైతు సంతోషంగా ఉంటే, రాష్ట్రం కూడా సంతోషంగా ఉంటుంది. – మా హయాంలో వ్యవసాయం పండగలా ఉండగా, చంద్రబాబు హయాంలో అది దండగలా మారింది. ఇటీవల మొంథా తుపాన్ చాలా నష్టం చేసింది. అసలు ఆ తుపాన్ వచ్చినప్పుడు, ఏ స్థాయిలో చంద్రబాబు, ఆయన కొడుకు, ఆయన దత్తపుత్రుడు బిల్డప్ ఇచ్చారో చూశాం. ఇంకా ఏ లెవెల్‌లో ఎల్లో మీడియా బిల్డప్ ఇచ్చారో చూశాం. – వారు తుపాన్ పీక పట్టి, డైవర్ట్ చేసినట్లు చెప్పారు. వారు కాబట్టే దాన్ని ఆపగలిగారన్న బిల్డప్ ఇచ్చారు. కానీ, చివరకు చూస్తే.. తుపాన్ వల్ల నష్టపోయిన ఏ రైతుకు పైసా సహాయం అందలేదు. దాదాపు 15 లక్షల ఎకరాలు తగ్గించి, నష్టాన్ని 4 లక్షలకు కుదించి చూపారు. కనీసం వారికి కూడా ఒక్క పైసా ఇవ్వలేదు. – చంద్రబాబు సీఎం అయ్యాక, రాష్ట్రంలో దాదాపు 17 సార్లు ప్రకృతి వైపరీత్యాలు. కానీ, ఒక్కసారి కూడా ఇన్‌పుట్ సబ్సిడీ పొందలేదు. దాదాపు రూ.1100 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు. ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేశాడు. – పైగా గతంలో రైతులకు హక్కుగా కొనసాగిన ఉచిత పంటల బీమాను పూర్తిగా ఎగ్గొట్టాడు. మా హయాంలో ఉచిత పంటల బీమా ద్వారా దాదాపు రూ.7,800 కోట్ల పరిహారం ఇచ్చాం. ఆ విధంగా రైతులకు అండగా నిలబడ్డాం. – రాష్ట్రంలో దాదాపు 84 లక్షల రైతులు ఉంటే, వారిలో కేవలం 19 లక్షల మంది రైతులకే పంటల బీమా సదుపాయం ఉంది. మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? – ఒకవైపు పెట్టుబడి సాయం సక్రమంగా లేదు. మరోవైపు ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. రైతులకు భరోసా లేకుండా పోయింది. ఉచిత పంటల బీమా కూడా లేకుండా పోయింది. – ఇంకా ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. ధాన్యం కొనేవారు లేరు. 75 కేజీల బస్తాకు మామూలుగా రూ.1776 రావాలి. కానీ, దళారులు అదే బస్తా రూ.1200, రూ.1300కు అడుగుతున్నారు. – నాడు మా ప్రభుత్వ హయాంలో అరటి, చీనీ కోసం అనంతపురం, తాడిపత్రి నుంచి ఢిల్లీ, ముంబైకి రైళ్లు నడిపాం. పెద్ద ఎత్తున రవాణా, ఎగుమతి. అంతకు ముందు అరటి ఎగుమతి 23 వేల టన్నులు మాత్రమే ఉంటే, మా ప్రభుత్వ హయాంలో ఏకంగా 3 లక్షల టన్నులు అరటి ఎగుమతి చేశాం. – చివరకు పులివెందులలో 600 టన్నుల కోల్డ్ స్టోరేజీని మా హయాంలో ప్రారంభిస్తే, ఈరోజు దాన్ని నడపడం లేదు. కరెంటు బిల్లు వస్తుందని. అంత హేయంగా ఉంది ఈరోజు పరిస్థితి. – నాడు, మా ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల ద్వారా పంటల కొనుగోలు జరిగింది. దాదాపు రూ.7,455 కోట్లు అందుకు ఖర్చు చేశాం. – రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. రైతన్నా మీ కోసం అంటూ ప్రచార కార్యక్రమం చేస్తున్నారు. నిజానికి వారు రైతుల దగ్గరకు పోయే పరిస్థితి లేదు. అయినా నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారు. నిస్సిగ్గుగా సూపర్‌హిట్ ప్రచారం: – ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. సూపర్‌సిక్స్ మొత్తం అమలు చేశారట? దానిపై ప్రకటనలు కూడా జారీ చేశారు. సూపర్‌సిక్స్ సూపర్‌హిట్ అని చెప్పుకుంటున్నారు. గోబెల్స్ ప్రచారానికి చంద్రబాబు టీచర్. – సూపర్‌సిక్స్‌లో ఏమేం అమలు చేశారు? నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేల చొప్పున రెండేళ్లకు రూ.72 వేలు ఇవ్వాలి. అసలు ఇచ్చారా? – ఆడబిడ్డ నిధి అంటూ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున, రెండేళ్లకు రూ.36 వేలు ఇవ్వాలి. ఇచ్చారా? – 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు. నెలకు రూ.4 వేల చొప్పున రెండేళ్లకు రూ.96 వేలు ఇవ్వాలి. ఇచ్చారా? – అన్నదాతా సుఖీభవ కింద ఏటా రూ.20 వేల చొప్పున రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాలి. ఇచ్చింది రూ.10 వేలు మాత్రమే. – అమ్మ ఒడిలో 30 లక్షల మంది కట్. రెండేళ్లకు కలిపి ప్రతి పిల్లాడికి రూ.30 వేలు ఇవ్వాలి. కానీ, ఇచ్చింది రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు మాత్రమే. ఇది మోసం కాదా? – ఏడాదికి 3 సిలిండర్లు అన్నారు. అలా రెండేళ్లకు 6 సిలిండర్లు ఇవ్వాలి. కానీ ఇచ్చింది కేవలం 3 సిలిండర్లు మాత్రమే. అది మోసం కాదా? – ఉచిత ప్రయాణం అన్నారు. కానీ, కొన్ని బస్సుల్లోనే అనుమతిస్తున్నారు. ఇది మోసం కాదా? – అలాంటప్పుడు వారిపై చీటింగ్ కేసు పెట్టి, బొక్కలో వేయాలి కదా? విద్యా రంగం అస్తవ్యస్తం: – ఈ ప్రభుత్వంలో విద్యార్థులు కూడ తలడిల్లుతున్నారు. జీఈఆర్ తగ్గింది. డ్రాప్ అవుట్స్ పెరిగాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు. మొత్తం 8 క్వార్టర్లు పెండింగ్. ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.5,600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది రూ.700 కోట్లు మాత్రమే. అంటే రూ.4,900 కోట్లు బకాయి. – వసతి దీవెన కింద ఏటా రూ.1100 చొప్పున, రెండేళ్లకు రూ.2,200 కోట్లు బకాయి పడ్డారు. విద్యాదీవెన, వసతి దీవెన కింద మొత్తం రూ.7,100 కోట్లు బకాయి పడ్డారు. – ప్రభుత్వ స్కూళ్లు నాశనం చేశారు. ప్రతి స్కూల్‌లో పిల్లలు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. గోరుముద్ద లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. నాడు–నేడు బంద్. చివరకు ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగునీరు, ఆహారం వల్ల ఈ 18 నెలల్లో 29 మంది పిల్లలు చనిపోయారు. ఇది ఒక రికార్డ్. (అంటూ.. పిల్లల ఫోటోలతో సహా పీపీటీ ద్వారా పూర్తి వివరాలు ప్రదర్శన) – ఇంకా కొన్ని వందల మంది కలుషిత నీరు, ఆహారం వల్ల ఆస్పత్రుల పాలయ్యారు. (అంటూ హాస్టళ్లలో దుస్థితి, దాంతో అస్వస్థులైన పిల్లలపై ఫోటోలు పీపీటీలో ప్రదర్శించారు) ఈ ప్రభుత్వానికి మరో మాయరోగం. – ఏ ప్రజలైనా అధికారం ఎందుకు ఇస్తారు? ప్రజలకు చేయాల్సినవి ఏమిటి? విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, శాంతి భద్రతల పరిరక్షణ. కానీ, మన రాష్ట్రంలో అవన్నీ రివర్స్. – బకాయిలు ఇవ్వకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు బంద్. పధకానికి నెలకు రూ.300 కోట్ల చొప్పున 18 నెలలకు గానూ రూ.5,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం రూ.1800 కోట్లు మాత్రమే. దీంతో ఇప్పటి వరకు రూ.3,600 కోట్లు బకాయి. – 108, 104 సర్వీసుల నిర్వహణలోనూ స్కామ్. రూ.5 కోట్ల టర్నోవర్ లేని సంస్థకు వాటి నిర్వహణ ఇచ్చారు. – పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, సంజీవని అంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. అన్నీ ప్రభుత్వానివి. యాజమాన్యం మాత్రం ప్రైవేట్: – మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో స్కామ్. ఇక్కడ మరో బొనాంజా.. మెడికల్ కాలేజీని ప్రైవేటుపరం చేసిన తర్వాత, వాటిలో పని చేసే సిబ్బందికి ప్రభుత్వం రెండేళ్లు జీతాలు ఇస్తుందట. – ఒక్కో టీచింగ్ ఆస్పత్రి.. 550 బెడ్లు ఉంటే, నెలకు సిబ్బందికి రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే అలా రెండేళ్లకు దాదాపు రూ.140 కోట్లు ప్రభుత్వం ఇస్తుందట. – అంటే కాలేజీ ప్రభుత్వానిది. ఆ భవనాలు ప్రభుత్వానివి. ప్రభుత్వ భూమి. ప్రభుత్వ సిబ్బంది. ప్రభుత్వ జీతాలు. కానీ యజమానులు ప్రైవేటువారు. – అంటే లాభాలు ప్రైవేటువారికి. భారం ప్రభుత్వం, ప్రజలకు. ఈనెల 16న గవర్నర్‌గారికి పత్రాలు: – మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణ జరుగుతుండగానే, చంద్రబాబు స్కామ్‌లు చేస్తున్నాడు. – 175 నియోజకవర్గాల్లో మా పార్టీ తరపున ర్యాలీలు. కోటి సంతకాల సేకరణ సాగుతోంది. వాటిని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రదర్శించి, ఈ నెల 10న జిల్లా కేంద్రాలకు పంపుతారు. – 13న జిల్లా కేంద్రాల్లో వాటిని ప్రజలకు చూపించిన తర్వాత, పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. – వాటన్నింటినీ తీసుకుని గవర్నర్‌గారికి ఈనెల 16న సమర్పిస్తాం. ఆయనకు అన్నీ వివరించిన తర్వాత.. ఆ పత్రాల ద్వారా హైకోర్టులో పిటిషన్ కూడా వేస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు: – ఈ నెలాఖరు నాటికి 5 డీఏలు పెండింగ్ కాగా, ఒక్కటి మాత్రమే ఇచ్చారు. అది కూడా వాయిదాల్లో ఇస్తారట. – ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, డీఏ బకాయిలు పదవీ విరమణ తర్వాత ఇస్తారట! ఇలాంటి ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు. ఒక్క చంద్రబాబు ప్రభుత్వం తప్ప. (అంటూ.. ఆ జీఓ చూపి, చదివి వినిపించారు) – చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా, సీఎం ఇలాంటి జీఓ తేలేదు. దానిపై గొడవ రేగడంతో, దాన్ని విత్‌డ్రా చేసి, డీఏ బకాయిలు వాయిదాల్లో ఇస్తామని చెప్పారు. – మెరుగైన పీఆర్‌సీ అని ఎన్నికల ముందు చెప్పారు. కానీ, ఆ ఊసే లేదు. చివరకు పీఆర్‌సీ ఛైర్మన్‌ను ఇంకా నియమించలేదు. ఎందుకంటే, ఛైర్మన్‌ను నియమిస్తే, రిపోర్టు ఇస్తే, దాన్ని అమలు చేయాలి. అందుకే ఆ పని చేయడం లేదు. – మెరుగైన పీఆర్‌సీ ఒక బూటకం. చివరకు ఐఆర్ లేదు. ఓపీఎస్ లేనే లేదు. చివరకు మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్ (గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్)ను కూడా రద్దు చేశాడు. దీంతో ఉద్యోగులు చాలా నష్టపోతున్నారు. – వివిధ రూపాల్లో ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఏకంగా రూ.31 వేల కోట్లు బకాయి పడింది. – ఆప్కాస్‌లో ప్రతి నెలా 1న జీతాలు ఇచ్చేలా మేము చర్య తీసుకుంటే, ఈరోజు అందులో సంఖ్య తగ్గించారు. చివరకు గుడుల్లో స్వీపర్లను కూడా కాంట్రాక్ట్ విధానంలోనే నియమిస్తున్నారు. ఆప్కాస్‌లో ప్రతి నెలా జీతాలు ఇవ్వడం లేదు. రెండు, మూడు నెలలకోసారి ఇస్తున్నారు. – గెస్ట్ లెక్చరర్లకు 8 నెలలుగా జీతాలు లేవు. విశాఖ స్టీల్ ప్లాంట్. ప్రైవేటీకరణ: – ఆంధ్రుల హక్కుగా ఎన్నో ఉద్యమాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. అనేక కార్యక్రమాల ద్వారా మా హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేయకుండా కాపాడాం. – ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని, చివరకు అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి, కేంద్రానికి పంపాం. – అదే స్టీల్‌ప్లాంట్‌పై ఎన్నికల ముందు, ఆ తర్వాత ఇటీవల చంద్రబాబు ఏం మాట్లాడారో చూద్దాం.. (అంటూ.. ఆ రెండు వీడియోలు ప్రదర్శించి చూపారు) – ఎన్నికల ముందు పోరాడతామని చెప్పి, కార్మికులతో నినాదాలు చేయించాడు. మళ్లీ ఇప్పుడు పని చేయకపోతే జీతాలు ఎందుకివ్వాలి? అంటూ ఎవరైనా అడిగితే, పీడీ యాక్ట్ కింద లోపలేస్తాం అంటున్నాడు. సంస్థ నష్టాలకు అసలు కారణం ఎవరంటే?: – అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలపాలు కావడానికి ఉద్యోగులు కారణం కాదు. ఎందుకంటే, ఆ సంస్థలో ఉద్యోగుల ఖర్చు చూస్తే.. (అదెలా అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) వర్సెస్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్).. – రెండింటిలో ఉద్యోగుల ఖర్చు 11.2 శాతం. అయితే సెయిల్‌లో ఆర్థిక పరిస్థితి ఎందుకు బాగుందంటే.. వాటికి సొంత ఖనిజ గనులు ఉన్నాయి. – దాని వల్ల ఇనుప ఖనిజం సేకరణ ఖర్చు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 18.6 శాతం కాగా, అదే సెయిల్‌లో ఆ వ్యయం కేవలం 9.8 శాతం మాత్రమే. అంటే సొంత ఖనిజ గనులు ఉండడం వల్ల, ఉత్తత్తి వ్యయం చాలా తగ్గింది. – విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత ఖనిజ గనులు కాకుండా, ప్రైవేటు రంగంలో పెట్టబోయే మిట్టల్ కంపెనీకి ఆ గనులు ఇవ్వమని చంద్రబాబు అడుగుతున్నాడు. రెడ్‌బుక్ రాజ్యాంగం. యథేచ్ఛగా వేధింపులు: – ఇది వెర్రితలలు వేస్తోంది. 18 నెలలుగా వారే అధికారంలో ఉన్నారు. వీరి హయాంలోనే నకిలీ మద్యం ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. అవి నడిపింది మొత్తం టీడీపీ నాయకులే. (అంటూ మరోసారి నకిలీ మద్యం తయారీ కంపెనీల ఫోటోలు పీపీటీలో చూపారు) – కుటీర పరిశ్రమ మాదిరిగా నకిలీ మద్యం తయారు చేసి అమ్ముతున్నారు. అంటే ప్రభుత్వం వాళ్లదే. వాళ్లవే వైన్‌షాప్‌లు. పర్మిట్ రూమ్‌లు. బెల్టుషాప్‌లు. చివరకు మద్యం తయారీ కూడా వాళ్లదే. పంపిణీ కూడా వాళ్లదే. – ఇప్పుడు నేను అడుగుతున్నాను. వీరి రెడ్‌బుక్ పాలనలో వాళ్లు కాకుండా ఇంకెవరైనా అలా మద్యం తయారు చేసి అమ్ముతారా? అసలు నిందితులను వదిలి..: – కానీ ఏం చేస్తున్నారు. మా పార్టీ నాయకుడు జోగి రమేష్‌ను అరెస్టు చేశారు. కేసులో ప్రధాన నిందితుడు జయచంద్రారెడ్డిని, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డి ఇంకా అరెస్టు కాలేదు. – మొత్తం నకిలీ మద్యం తయారు చేసి, పంపిణీ చేసింది వాళ్లు. అయినా వారిపై ఏ చర్యా లేదు. అన్నీ వారే చేస్తూ.. తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వారిని అరెస్టు చేశారు. జోగి రమేష్‌కు అంటగట్టి ఆయన్ను అరెస్టు చేశారు. – ఒక మాజీ మంత్రి పరిస్థితి ఇలా ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. – దొంగే.. తిరిగి దొంగా దొంగా అంటున్నారు. ఎంత దారుణం. జోగి రమేష్ కుటుంబంపైనా కక్ష: – చివరకు జోగి రమేష్ కుమారుడు ఇటీవల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని, అతడిపైనా కేసు పెట్టారు. 30 ఏళ్లలోపు ఉంటాడు. ఇటీవలే పెళ్లి అయింది. అతడిని కూడా వేధిస్తున్నారు. – కారణం, తన తండ్రి ఆబ్సెన్స్‌లో తాను కోటి సంతకాల కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నాడు కాబట్టి. పిన్నెల్లి సోదరులపై కుట్ర: – ఇంకా మాచర్లలో మా పార్టీ సీనియర్ నాయకుడు, నాలుగుసార్లు ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడిని టీడీపీలో వర్గపోరుతో జరిగిన హత్యల కేసులో ఇరికించారు. – టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో హత్యలు జరిగాయని, అప్సటి ఎస్పీ శ్రీనివాసరావు స్వయంగా చెప్పాడు. జంట హత్యల్లో నిందితులు, చనిపోయిన వారు అందరూ టీడీపీకి చెందిన వారు అని చెప్పారు. (అంటూ, ఆ వీడియో కూడా ప్రదర్శించి చూపారు) – చనిపోయిన వారిద్దరూ టీడీపీ వర్గీయులు. చంపిన వారు కూడా అదే పార్టీకి చెందిన వారు. అని పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. ఆ ఎస్పీ మీడియా సాక్షిగా అది చెప్పడమే కాకుండా, ట్వీట్ కూడా చేశాడు. – ఆ మర్నాడు ఈనాడులో కూడా అదే రాశారు. ఆధిపత్య పోరులో ఇద్దరు టీడీపీ నేతల దారుణహత్య అని రాశారు. ఈనాడు వారి గజిట్ పేపర్. – అయినా ఆ కేసలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, ఆయన తమ్ముడిపై కేసు పెట్టి వేధిస్తున్నారు. – ఎక్కడైనా న్యాయం, ధర్మం ఉన్నాయా? – అంతకు ముందు కూడా, ఎన్నికల్లో రిగ్గింగ్‌ను అడ్డుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని 54 రోజులు జైల్లో ఉంచారు. చంద్రబాబు సీఎం అయ్యాక, ఆయనపై ఏకంగా 16 కేసులు పెట్టారు. విద్యార్థి నాయకుడు కొండారెడ్డిపై వేధింపులు: – విశాఖలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడు కొండారెడ్డిని కూడా దొంగ కేసులో ఇరికించి అరెస్టు చేశారు. అతడు విద్యార్థి అని కూడా చూడకుండా గంజాయి కేసు పెట్టారు. అందుకు తప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. – రైల్వే న్యూకాలనీలో పట్టుకున్నామని ఎఫ్‌ఐఆర్‌లో రాశారు. కానీ, నిజానికి ఆయన్ను తన ఇంటివద్ద మద్దెలపాలెం వెళ్తుంటే, అడ్డుకుని అదుపులోకి తీసుకున్నట్లు సీసీ ఫుటేజ్ ఉంది. ఆ టైమ్‌లో పీఎస్ తీసుకుపోయినట్లు కూడా సీసీ ఫుటేజ్ ఉంది. – ఆ పిల్లాడి బైక్ 14 కి.మీ తీసుకెళ్లి, రైల్వే న్యూకాలనీకి తీసుకెళ్లి అక్కడ పట్టుకున్నట్లు చూపి, ఎఫ్‌ఐఆర్ రాశారు. దాంట్లో జీపీఎస్ ఉండడం వల్ల బైక్‌ను పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి తీసుకుపోయినట్లు రికార్డు అయింది. లేని లిక్కర్ స్కామ్ సృష్టి: – చంద్రబాబుపై లిక్కర్ కేసు ఉంది. దాన్నుంచి ఆయన బయట పడేందుకు మధ్యలో మేము అమలు చేసిన పాలసీని తప్పుగా చూపే ప్రయత్నం చేస్తున్నాడు. – ఎందుకంటే, చంద్రబాబు మళ్లీ గతంలోని పాలసీనే అమలు చేస్తున్నాడు. దాన్ని సమర్థించుకునేందుకు, లేని లిక్కర్ స్కామ్ సృష్టించాడు. – ఆ కేసులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని, పీవీ మిధున్‌రెడ్డిని అరెస్టు చేశారు. మిధున్‌రెడ్డికి బెయిల్ ఇస్తూ, జడ్జీ చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అరెస్టు చేశారని ప్రస్తావించారు. – లేని స్కామ్‌ను ఉన్నదన్నట్లు చూపుతూ, రిటైర్డ్ అధికారులను అరెస్టు చేసి, జైలుకు పంపారు. « ఆ బండారం బయట పడుతుందని!: – ఇంకా దారుణం ఏమిటంటే.. ఎక్కడో ఒక కాలేజీ ఫామ్‌హౌజ్‌లో రూ.11 కోట్లు పెట్టి, అది లిక్కర్ స్కామ్ డబ్బు అని చూపాలని చూశారు. – ఆ నోట్ల వివరాలు బయటకు తీయాలని కోర్టులో పిటిషన్ వేయడంతో, దాన్ని వెంటనే ఇతర కరెన్సీలో కలిపేశారు. ఎందుకంటే, అది ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన డబ్బు. – నోట్ల వివరాలు బయటకు తీస్తే, తమ అక్రమాలు, కుట్ర బయట పడతాయని ఆ పని చేశారు. – ఇంకా అనేక మంది వైయస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేశారు. – చివరకు పోసాని కృష్ణమురళి వంటి ఆర్టిస్టులు, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపైన, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ౖలపైనా కేసులు పెట్టారు. ‘సాక్షి’పై కక్ష సాధింపు: – చివరకు సాలూరులో మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ వేధించాడని చెప్పి, మండల ఆఫీస్‌లో పని చేస్తున్న ఒక మహిళ, తగిన సాక్ష్యాలతో (వాట్సాప్ మెసేజ్‌లు) పీఎస్‌కు వెళ్తే, కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదు. – పైగా ఆమెనే వేధించారు. ఆమె ఫోన్ తీసుకున్నారు తప్ప, ఆమె ఫిర్యాదు చేసిన సతీష్ ఫోన్‌ను స్వాధీనం చేసుకోలేదు. కనీసం కేసు పెట్టలేదు. అరెస్టు చేయలేదు. – దీంతో ఆమె విలేకరులను ఆశ్రయించి, గోడు చెప్పుకుంటే, సాక్షి పత్రిక రాసింది. దీంతో పేపర్‌పై కేసు పెట్టారు. ఇలా ఎక్కడికి పోతున్నాం? దేవుణ్ని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు: – ప్రపంచంలోనే ఒక విశిష్టత ఉన్న ఆలయం తిరుమల శ్రీవారి ఆలయం. అలాంటి గుడిని చంద్రబాబు అభాసు పాల్జేస్తున్నాడు. అయ్యా చంద్రబాబూ.. నేను అడుగుతున్నాను. దమ్ముంటే జవాబు చెప్పండి. – ‘నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, అది లడ్డూలో కలిసిందని, ఆ లడ్డూలను భక్తులు తిన్నారని.. చంద్రబాబు అన్నారు కదా..మరి మీ మాటలకు ఆధారాలు దొరికాయా? – కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ఆ ట్యాంకర్లు ప్రసాదం తయారీలోకి వెళ్లాయా? దానికి ఆధారాలు ఉన్నాయా? ఎందుకంటే టీటీడీలో రోబస్ట్ ప్రొసీజర్ ఉంది. అది ఒక పక్కా వ్యవస్థ. – నెయ్యిలో నాణ్యత లేకపోతే, ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే, గతంలో చంద్రబాబు హయాంలో 15 ట్యాంకర్లు, మా ప్రభుత్వ హయాంలో 18 ట్యాంకర్లు వెనక్కు పంపారు. – అంత పకడ్బందీ వ్యవస్థ ఉంటే, కల్తీ నెయ్యికి ఎక్కడ ఆస్కారం ఉంది. – అదే కల్తీ నెయ్యి, దాని వినియోగానికి సంబంధించి టీటీడీ ఈఓ శ్యామలరావు ఏం మాట్లాడారో చూడండి. (అంటూ ఆ వీడియో ప్రదర్శించి చూపారు) – ఇంత క్లియర్‌కట్‌గా టీటీడీ ఈఓ గత ఏడాది సెప్టెంబరు 20న, ఈ మాటలు చెప్పారు. కల్తీ నెయ్యి ఆనవాళ్లు కనిపించగానే, నాలుగు ట్యాంకర్లు వెనక్కు పంపించినట్లు చెప్పారు. అప్పుడు చంద్రబాబుగారి ప్రభుత్వమే ఉంది. అదే నిజమైతే.. అందుకు బా«ధ్యులెవరు?: – చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన హయాంలో అదే రీతిలో జూలైలో 4 ట్యాంకర్లు తిప్పి పంపారు. – మళ్లీ ఆగస్టులో ఆ ట్యాంకర్లు తిరిగి వచ్చాయని, లడ్డూ ప్రసాదంలో వాటిని వాడారని, ఇటీవలి రిమాండ్ రిపోర్టులో సిట్ రాసింది. – ఇదే కనుక నిజమైతే.. రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్లీ ఎలా వచ్చాయి? అది ప్రభుత్వ వైఫల్యం కాదా? టీటీడీ ఈఓ ఏం చేస్తున్నాడు? ఆయన్ను ఎందుకు అరెస్టు చేయలేదు? – అప్పుడు, ఇప్పుడు ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే కదా? మరి ఎవరి మీద నిందలు వేస్తున్నారు? – ఆ ఈఓపై ఎందుకు కేసు పెట్టలేదు? దేవుడంటే భయం, భక్తి లేదు. అప్పుడు అది కూడా కల్తీయేనా?: – స్వచ్ఛమైన నెయ్యి కిలో రూ.320కే ఎలా సరఫరా చేస్తారని చంద్రబాబుగారు, ఆయన పార్టీకి చెందిన నాయకులు ప్రశ్నించారు. ఈనాడు అయితే మంచి నెయ్యి కనీసం రూ.1000 నుంచి రూ.1600 వరకు ఉంటుందని రాశారు. – మరి ఈరోజు టీటీడీలో నెయ్యి ఎంతకు కొంటున్నారు? రూ.3 వేలకా, లేక రూ.1600కు కొంటున్నారా?. – ఇదే చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య అదే కిలో నెయ్యి రూ.276 నుంచి రూ.314 వరకు కొన్నారు. మరి అక్కడ «రూ.320 కంటే ధర ఇంకా తక్కువగా ఉంది కదా? మరి అదంతా కల్తీ నెయ్యేనా? సమాధానం చెప్పండి. మీ హయాంలోనే బోలే బాబా డెయిరీ: – ఇంకో గమ్మల్తైన విషయం చెబుతా. బోలే బాబా డెయిరీ విషయంలో దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ కంపెనీ ఎప్పుడు వచ్చిందో చూద్దాం. (అంటూ ఆ వివరాలు కూడా చదివి వినిపించారు) – మరి అప్పుడు ఉన్నది టీడీపీ ప్రభుత్వమే కదా? – తిరుమలలో నెయ్యి, ఇతర సరుకుల కొనుగోలుకు ఒక రొబొస్ట్ విధానం ఉంది. దాంట్లో ఎవరికీ ప్రమేయం ఉండదు. సప్లై చేసేది ఏ కంపెనీ అయినా, అమలులో ఉన్న రొబొస్ట్ విధానం ప్రకారమే అన్నీ జరుగుతాయి. ఎన్‌డీడీబీ సర్టిఫికెట్, ల్యాబ్ టెస్ట్ తప్పనిసరి. విచారణ కోరిందే వైవీ సుబ్బారెడ్డిగారు: – టీటీడీపై దుష్ప్రచారాలు ఆపాలి. నిజాలు నిగ్గు తేల్చండి అని సుప్రీంకోర్డును ఆశ్రయించింది ఎవరు? టీడీపీ వారు కాదు. వైవీ సుబ్బారెడ్డిగారు. ఆయన ఇంట్లో నిత్యం గోపూజ జరుగుతుంది. ఆయన కనీసం 30సార్లు అయ్యప్పమాల వేసుకున్నాడు. – అలాంటి ఆయనపై ఏం ఆరోపణలు, ఎందుకు చేస్తున్నారు? ‘సిట్’లో అంతా వారి మనుషులే: – ఇంకా సిట్‌లో చంద్రబాబు వేసిన అధికారుల వివరాలు చూస్తే.. ఒకరు కృష్ణయ్య సమీప బంధువు. గోపీనాథ్‌జెట్టీ. ఆయనకు ఎన్టీఆర్ ట్రస్ట్‌లో కీలకంగా ఉన్నారు. – అదే కృష్ణయ్య రిటైర్ అయినా, చంద్రబాబు ఆయన్ను వదిలిపెట్టకుండా, ఏపీ పొల్యూషన్ బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. – ఇంకో అధికారి సర్వశ్రేష్ట త్రిపాఠి. ఆయన గత ఎన్నికల ముందు పల్నాడులో టీడీపీ కోసం ఎంత పని చేశాడో అందరం చూశాం. చంద్రబాబు సీఎం అయ్యాక, ఆయన్ను పక్కన పెట్టుకున్నాడు. అప్పన్న వీపీఆర్ పీఏ: – ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అప్పన్న. ఆయన వైవీ సుబ్బారెడ్డి పీఏ కాదు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పీఏ. ఆ వీపీఆర్ టీడీపీ ఎంపీ. ఆయన వద్ద అప్పన్న ప్రతినెలా జీతం తీసుకుంటున్నాడు. ఆ తర్వాత ఏపీ భవన్ ఉద్యోగి. – మరి ఎక్కడ వైవీ సుబ్బారెడ్డి వచ్చాడు. అప్పన్న వైవీ సుబ్బారెడ్డి పీఏ అని ఎల్లో మీడియాలో ఎందుకుంత ప్రచారం చేస్తున్నారు? – ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం, వ్యవస్థలన్నీ కూడబలుక్కుని పని చేస్తున్నాయి. – ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. చంద్రబాబు సీఎంగా ఉండగా, ఆయన ప్రభుత్వంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. – రిజెక్టు చేసిన ట్యాంకర్లు నెల తర్వాత వచ్చాయని మీరే చెప్పారు. మీ ప్రభుత్వమే ఉంది. మరి తప్పు ఎవరిది? – ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం, అన్ని తప్పులు చేస్తున్నారు. పరకామణి చోరీ కేసు: – ఆరోజు హుండీ డబ్బులు లెక్కిస్తుంటే, 9 అమెరికన్ డాలర్లు.. దాని విలువ ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.72 వేలకు పైగా. – ఆ దొంగను పట్టుకున్న అ«ధికారి చివరకు చనిపోయేలా చేశారు? – ఆ దొంగ కుటుంబ సభ్యులు రూ.14 కోట్ల విలువైన వారి ఆస్తులు దేవుడికి ఇవ్వడం తప్పా? – దేశంలో అనేకచోట్ల అలాంటి ఘటనలు జరిగాయి. మరి ఎక్కడైనా అలా ఆస్తులు రాసిచ్చారా? ఒక్కసారి అంతా ఆలోచించాలి. – ఆ ప్రక్రియ మొత్తం కోర్టుల పరిధిలో, కోర్టు ప్రొసీజర్‌తో చట్టబద్దంగానే జరిగింది. కేసు నమోదు చేశారు. తిరుపతి కోర్టులో ఛార్జ్‌షీట్ వేశారు. మెగా లోక్‌అదాలత్‌లో విచారణ చేశారు. – ఒక వేళ అది తప్పనుకుంటే, విచారణ చేయొచ్చు. కానీ, దానికి వైవీ సుబ్బారెడ్డిగారిని, కరుణాకర్‌రెడ్డిగారిని బాధ్యులను చేస్తూ.. ఎల్లో మీడియాలో కథనాలు రాయించడం ఎంత వరకు సబబు? – ఆ దొరికిన దొంగ జీయర్‌స్వామి మఠంలో 30 ఏళ్ల నుంచి పని చేస్తున్నాడు. పరకామణి లెక్కింపులో అనేక సంవత్సరాలు పాల్గొన్నాడు. – మరి ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఆ దొంగను ఎందుకు పట్టుకోలేకపోయింది? అందువల్లే ఆ దొంగ దొరికాడు: – అదే మా ప్రభుత్వంలో ఎలా దొరికాడు అంటే, మేము రూ.23 కోట్లతో పరకామణిని మొత్తం మార్చాం. మరిన్ని భద్రతా ఏర్పాట్లు చేశాం. – కొత్త భవనం కట్టాం. పాత బిల్డింగ్‌లో అరకొర సీసీ కెమెరాలు ఉండగా, మేము కొత్త భవనంలో అత్యాధునిక మానిటరింగ్ విధానం తీసుకొచ్చాం. అవన్నీ చేసిన తర్వాతనే.. ఆ దొంగ పట్టుబడ్డాడు. – అంత గొప్ప వ్యవస్థ సృష్టిస్తే, మాపై నిందలు వేస్తారా? – ఇంకా టీడీపీ నాయకులతో చంద్రబాబు దారుణంగా మాట్లాడిస్తున్నారు.. (అంటూ టీడీపీ నాయకుడు వర్ల రామయ్య ప్రెస్‌మీట్ మాటలు ప్రదర్శించి చూపారు) – తమిళనాడులోని ఆస్తులను అక్కడ రిజిస్టర్ చేయకపోతే, ఇక్కడ చేస్తారా? టీటీడీకి మేలు చేయడం తప్పా?: – చంద్రబాబు ఏకంగా న్యాయవ్యవస్థ మీద దాడి చేయిస్తున్నాడు. మొత్తం కోర్టులు, న్యాయమూర్తులపై పార్టీ నాయకులతో మాట్లాడిస్తున్నాడు. – ధర్మం, చట్టం తెలిసిన వారిగా, టీటీడీకి మంచి చేయడం కోసం, జడ్జీలు ఒక కొత్త పరిష్కారం చూపడం తప్పా? ఎందుకంటే టీటీడీ అంత ప్రతిష్టాత్మకమైన సంస్థ. – అందులో రాజకీయం చేయడం అవసరమా? – 9 డాలర్ నోట్లు దొరికితే ఏకంగా రూ.14 కోట్ల ఆస్తిని టీటీడీకి రాయించారు. అందులో అంత మంది న్యాయనిపుణులు ఏకాభిప్రాయంతో ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీకి మేలు చేయడం కోసమే కదా? సింహాచలంలో మీరు ఆ పని ఎందుకు చేయలేదు?: – ఇంకా ఈ ఏడాది సెప్టెంబరు 1న, సింహాచలంలో హుండీ సొమ్ము రూ.55 వేలు దొంగతనం చేస్తూ, దేవస్థానం ఉద్యోగి రమణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడితే, ఉద్యోగిని తొలగించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని అరెస్టు చేసి, స్టేషన్ బెయిల్‌పై వదిలిపెట్టారు. – మరి చంద్రబాబు ఎందుకు వారి ఆస్తులు స్వాధీనం చేసుకోలేదు. అంటే ఒక్కో చోట ఒక్కో న్యాయమా? – ఆ సింహాచలం దేవస్థానం ధర్మకర్త ఎవరు? అశోక గజపతిరాజు కదా? ఆయనపై కేసు ఎందుకు పెట్టలేదు? – అంటే కరుణాకర్‌రెడ్డికి, వైవీ సుబ్బారెడ్డికి ఒక న్యాయం.. అశోక గజపతిరాజుకు ఒక న్యాయమా? టీడీపీ హాయంలోనే అక్రమాలు: – నిజానికి దేవుడి సొమ్ము ఎవరు దుర్వినియోగం చేశారో చూద్దాం. తిరుపతిలో శ్రీనివాస సేతు నిర్మాణం కోసం రూ.684 కోట్ల వ్యయం అంచనా. దాంట్లో 65 శాతం డబ్బు టీటీడీ నుంచి ఆ నిర్ణయంలో బోర్డు పాత్ర లేదు. అంటే బోర్డు అనుమతి లేకుండా ముందు ఇచ్చేశారు. ఆ తర్వాత బోర్డు అనుమతి తీసుకున్నారు. – మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వ్యయం అంచనాను రూ.40 కోట్లు తగ్గించాం. మా ప్రభుత్వం రాకపోతే, ఆ సొమ్ము ఎవరి చేతుల్లోకి పోయేది. – మరో అంశం. టీటీడీ డబ్బు 10 శాతానికి మించి ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయొద్దు. కానీ, చంద్రబాబు ఒత్తిడి చేసి ఏకంగా రూ.1300 కోట్లు ఎస్ బ్యాంక్‌లో డిపాజిట్ చేశారు. – మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ డబ్బు వెనక్కి తీసుకుని, ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్ చేయించాం. ఆ తర్వాత 3 నెలలకు ఎస్ బ్యాంక్ పతనమైంది. మరి ఇక్కడ తప్పు చేసింది ఎవరు? అయినా మేం రాజకీయం చేయలేదు: – మాకు ఇన్ని కఠోర వాస్తవాలు తెలిసినా, మేము ఏనాడూ రాజకీయం చేయలేదు. ఎందుకంటే, టీటీడీ ప్రతిష్ట దెబ్బ తింటుందని. రాజకీయాలు చేయడం సరికాదని. – టీటీడీ బోర్డుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. దాంట్లో ఎవరు పడితే వారిని నియమించరు. కాస్త పేరున్న వారే వస్తారు. – అంత విశిష్టత ఉన్న ఆలయం, బోర్డు ప్రతిష్టను మంట గలుపుతూ, రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నిస్పిగ్గు వ్యవహారం. సొంత కేసుల ఎత్తివేత: – ఇన్ని జరుగుతుంటే, సందట్లో సడేమియా మాదిరిగా, తన మీద ఉన్న అవినీతి కేసులను చంద్రబాబు మాఫీ చేయించుకుంటున్నాడు. – ఇది బెయిల్ నిబంధనల ఉల్లంఘన కాదా? ఆలోచించాలి – తానే దొంగ. తానే పోలీస్. తానే పబ్లిక్ ప్రాసిక్యూటర్. అధికారులను బెదిరించి, వారితో అబద్ధపు వాంగ్మూలాలు చెప్పించి, గవర్నమెంట్‌గా తానే పిటిషన్లు వేసి, ఒక్కో కేసు మాఫీ చేయించుకుంటున్నాడు. – ఇంత బరితెగింపు ఎక్కడా ఉండదు. దాని మీద ఎల్లో మీడియా అస్సలు రాయదు. – స్కిల్ స్కామ్ మామూలు కేసు కాదు. చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి, డొల్ల కంపెనీలకు రూ.370 కోట్లు ఇచ్చాడు. దాని మీద కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఈడీ అరెస్టులు కూడా చేసింది. – అంటే డొల్ల కంపెనీలు పెట్టిన, డబ్బు తీసుకున్న వారిని అరెస్టు చేశారు కానీ, డబ్బు ఇచ్చిన వాణ్ని ఏం చేయలేదు. – అన్ని ఆధారాలు పరిశీలించాక, చంద్రబాబును కోర్టు జైలుకు కూడా పంపించింది. అయినా నిస్సిగ్గుగా కేసు మాఫీ చేసుకున్నాడు. రెండో కేసు. అసైన్డ్ ల్యాండ్ స్కామ్: – ఆ భూములు ఎవరూ కొనవద్దు. అలాంటి స్కామే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ స్కామ్. హెరిటేజ్ భూముల వద్ద రోడ్డు మలుపు తిప్పారు. – ఇసుక ఉచితం పేరుతో మరో స్కామ్. మా హయాంలో ప్రభుత్వానికి ఏటా రూ.700 కోట్ల ఆదాయం వచ్చేది. – ఫైబర్‌నెట్ స్కామ్. బ్లాక్ లిస్టులో ఉన్న తన అనుచరుడికి చెందిన కంపెనీకి అన్నీ అప్పగించిన స్కామ్. – లిక్కర్‌ను ఎమ్మార్పీ కంటే ఎక్కువ అమ్మడమే కాకుండా, బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి, వేల కోట్ల నష్టం చేశారు. – ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఎంపిక చేసిన డిస్టిలరీల నుంచే మద్యం సేకరణ. – మరోవైపు నకిలీ మద్యం. ప్రతి 4 బాటిళ్లకు ఒకటి నకిలీ మద్యం. తొలి నుంచి ఆయన వైఖరి అదే: – కేసులు మాఫీ చేసుకోవడంలో చంద్రబాబుది తొలి నుంచి ఒకటే పాలసీ. – నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడం మొదలు.. ఓటుకు కోట్లు కేసు.. తాజాగా లిక్కర్ కేసు మాఫీ. అందుకే.. – వీటన్నింటి నుంచి ప్రజలను మభ్య పెడుతూ, ప్రజల దృష్టి మళ్లించేందుకు తాను, తన ఎల్లో మీడియా చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ఎండగడుతూ.. ఎప్పటికప్పుడు నాణ్యానికి మరోవైపు చూపుతూ, ప్రజల్లో అవగాహన కల్పించే పని చేస్తాం. మీడియా ప్రశ్నలకు సమాధానంగా.. – ప్రజాస్వామ్యంలో కోర్టుల ద్వారా పోరాడతాం. పై నుంచి దేవుడు, కింద ప్రజలు చూస్తారు. వారే ఎప్పటికైనా బుద్ధి చెబుతారు. – అమరావతి కోసం 53 వేల ఎకరాలు తీసుకుంటూ, 2014–19 మధ్య ఏం చెప్పాడు? అది అంతర్జాతీయ రాజధాని అని ప్రచారం చేశాడు. సింగపూర్‌ను మించి పోతుందన్నాడు. – కానీ, అక్కడ నిర్మాణాలు దేవుడెరుగు.. ఆ 50 వేల ఎకరాల్లో కనీస మౌలిక సదుపాయాల కోసం ఎకరాకు రూ.2 కోట్లు కావాలన్నాడు. అంటే లక్ష కోట్లు కావాలి. – నాడు రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అన్నాడు. మళ్లీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు. మొత్తం అప్పులే. అడ్డగోలుగా వ్యయం పెంచి, కాంట్రాక్ట్‌లు అçప్పగిస్తున్నారు.