పైడిభీమవరంలో వైయ‌స్ఆర్‌టీయూసీ ఆవిర్భావ దినోత్సవం 

ఎచ్చెర్ల: రణస్థలం మండలం పైడిభీమవరం గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ అసెంబ్లీ పరిశీలకులు, ఎచ్చెర్ల నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పిన్నింటి సాయికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో వైయ‌స్ జ‌గ‌న్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసి, రాష్ట్రాన్ని సంక్షేమం మరియు అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డొప్ప రాము, మాజీ ఏఎంసీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకులు లంకలపల్లి ప్రసాదరావు, ఎంపీటీసీ సభ్యులు ఆకలి శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు బావిశెట్టి నారాయణ అప్పారావు, అల్లింపల్లి సతీష్, మైలవరపు పీరు, పెసల శ్రీను,   సీనియర్ నాయకులు మహంతి సత్యం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Back to Top