వైయస్ఆర్ జిల్లా: కడప నగరంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైయస్ఆర్‌టీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వైయస్ఆర్ టీయూసీ జిల్లా అధ్యక్షుడు జాషువా, నగర అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వైయస్ఆర్‌టీయూసీ జెండా ఆవిష్కరణతో పాటు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) సభ్యుడు కె. సురేష్ బాబు , మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా , అలాగే కడప నగర మాజీ మేయర్ పాక సురేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమం కోసం వైయస్ఆర్‌టీయూసీ చేస్తున్న కృషిని కొనియాడారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా కార్మిక హక్కుల పరిరక్షణలో మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జీలు, అనుబంధ సంఘాల నాయకులు, నాయకురాళ్లు, ఇతర వైయస్ఆర్‌టీయూసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.