విశాఖ: వైయస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం గాజువాక నియోజకవర్గం పరిధిలోని పెదగంట్యాడ జంక్షన్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ట్రేడ్ యూనియన్ గాజువాక అధ్యక్షులు పెట్టా రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గం పరిశీలకులు పసుపులేటి బాలరాజు, నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తి రెడ్డి జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ లక్ష్యమని పేర్కొన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం యూనియన్ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్టీయూసీ జోనల్ అధ్యక్షులు పీవీ సురేష్, జిల్లా అధ్యక్షులు రాయపురెడ్డి అనిల్, నక్క వెంకటరమణ, పల్లా చిన్నతల్లి, ధర్మాల శ్రీను, పల్లా సురేష్, బోగాది సన్యాసిరావు, గొందేసి శ్రీనివాస రెడ్డి, బొడ్డ గోవింద్, జీలకర్ర నాగేంద్ర, అండిబోయిన అప్పారావు, ఎల్లిపోగుల వరలక్ష్మి, శకునాల చంద్రశేఖర్, నంబాల రాము, బోరా శశిభూషణ్, చిత్రాడ వెంకటరమణ, ఉంగరాల శ్రీను తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.