గుంటూరులో వైయ‌స్ఆర్‌టీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

గుంటూరు జిల్లా:  గుంటూరు నగర, తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా, నగర కార్మిక విభాగం ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ షేక్ నూరి ఫాతిమా ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల సంక్షేమం కోసం పార్టీ కట్టుబడి పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కార్మిక విభాగం అధ్యక్షుడు  పవన్ కుమార్, నగర అధ్యక్షులు మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రావు పాల్గొన్నారు. అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి బాబు, తూర్పు నియోజకవర్గం నుంచి చెన్నయ్య, పశ్చిమ నియోజకవర్గం నుంచి పేరుబోయిన బాబు, పెదకాకాని నుంచి షేక్ మస్తాన్ వలి హాజరయ్యారు.  
 

Back to Top