తిరుపతి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి బయటకు వస్తే ప్రజలు కడలి వలె ఉప్పొంగి తరలి వస్తున్నారని, జన సునామీలో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు. వైయస్ జగన్ పల్నాడు పర్యటన, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గురువారం ఆయన స్పందించారు. భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..`తప్పుడు కేసులు బనాయించడంలో చంద్రబాబు సర్కారు రాటుదేలిపోయింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏడాది పాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల విష ప్రచారం చేయడానికే వెచ్చించారు.143 హామీలు అమలు చేయకుండా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న నాయకులు అందరిపై తప్పడు కేసులు పెడుతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై మద్యం కేసు సభ్య సమాజం నవ్వుకుంటోంది. చంద్రబాబు ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలపై ప్రజలు గమనిస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ పాలనలో ఒక్క మంచిపని కూడా చేయకుండా నిరక్ష్యం చేస్తూ, మాయ మాటలు తో నిరంతరం 16 ఏళ్ళు సీఎం గా పనిచేసిన వ్యక్తి ప్రత్యర్థి పార్టీ నాయకులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. నిన్న పల్నాడులో ఏం జరిగింది ప్రత్యక్షంగా చూశారు, వైయస్ జగన్ మోహన్ రెడ్డి బయటకు వస్తే ప్రజలు కడలి వలె ఉప్పొంగి తరలి వస్తున్నారు. టిడిపి జన సునామీలో టిడిపి కొట్టుకు పోవడం ఖాయం. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, సోషల్ మీడియా కార్యకర్తలను తప్పుడు కేసులతో వేధిస్తున్నారు. మిమ్మల్ని చూసి ఎవరు బయటపడటం లేదు. ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కు అండగా ఉన్నారు` అని విశ్వాసం వ్యక్తం చేశారు.