

















వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్ర అడ్డుకున్న పోలీసులు
శ్రీసత్యసాయి జిల్లా: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. ఆర్‌డీటీ పరిరక్షణ కోసం వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య చేస్తున్న పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్ర వచ్చే దారిలో టీడీపీ నేతల కార్యక్రమం ఉందని, సాయంత్రం దాకా కళ్యాణదుర్గం వెళ్లొద్దంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసుల వైఖరిపై మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు.
కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆదేశాలతో పోలీసులు పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో వైయస్ఆర్‌సీపీ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇవాళ గూబనపల్లి నుంచి కళ్యాణదుర్గం పట్టణంలోకి మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్ర చేపట్టారు. ఈయన యాత్రకు వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ సంఘీభావం తెలిపారు.