అభివృధి పనులు సత్వరం చేపట్టండి

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ డాక్టర్ సత్యవతి 
 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు రంగానికి రూ. 3 లక్షల కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రకటించిన గౌరవ మంత్రి నితిన్ గడ్కరీ కి కృతజ్ఞతలని అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి పేర్కొన్నారు. సోమవారం పార్లమెంట్ లో ఆమె మాట్లాడుతూ కోస్తా ప్రాంతంలో రోడ్డు కనెక్టివిటీ పర్యాటకాన్ని పెంచుతుందని,పట్టణ గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగ పడుతుందన్నారు. దీనిలో భాగంగా తన పార్లమెంట్ నియోజకవర్గంలో అనకాపల్లి-ఆనందపురం 6 లైన్ల రోడ్డును మంత్రివర్గం దాదాపు మూడేళ్ల క్రితమే మంజూరు చేసిందని గుర్తు చేశారు. వీలైనంత త్వరగా దీనికి సంబంధించి చర్యలు వేగవంతం చేయాలని మంత్రిని కోరారు.  ఈ రోడ్డులో డిజైన్‌ ప్రకారం హెలిప్యాడ్‌ను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  అయితే హెలిప్యాడ్ నిర్మాణానికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ ఇవ్వలేదనితెలిపారు   దానికి తోడు, వైజాగ్ నగరానికి సమీప రహదారి అయిన షీలా నగర్ మరియు పోర్ట్-రోడ్డుకు ఈ రహదారిని కలుపుతూ ఒక చిన్న బైపాస్ రోడ్డు త్వరగా అవసరమని వెల్లడించారు.
 తొట్టాడ జంక్షన్ వద్ద NH-16 హైవేపై రోడ్డు అండర్‌పాస్ కూడా ప్రతిపాదిత ఆరు లేన్ హైవేలో చేర్చబడిందన్నారు.  ఇది ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతం, పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. యలమంచిలి సమీపంలోని NH-16లో పురుషోత్తమపురం Jn వద్ద మరో బ్లాక్ స్పాట్ ఉంది.  రహదారి భద్రతను కాపాడేందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అనకాపల్లి జిల్లా ఆసుపత్రితో పాటు సిహెచ్‌సి ఎలమంచిలి మరియు సిహెచ్‌సి నక్కపల్లెలో ట్రామా కేర్ సెంటర్లు అవసరం, ఇవి ఎన్‌హెచ్-16ను కలుపుతూ రోజూ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. 3 జిల్లాలను కలిపే వెంకన్నపాలెం-నర్సీపట్నం మీదుగా సబ్బవరం నుండి తునికి రాష్ట్ర రహదారిని మార్చడం విజయనగరం, విశాఖపట్నం మరియు తూర్పుగోదావరి మూడు జిల్లాల ప్రజలకు చాలా అవసరమని తెలిపారు.
ఈ ప్రాజెక్టులను ప్రాధాన్యతా ప్రాతిపదికన పరిగణించి, వాటి సత్వర అమలుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి  కృతజ్ఞతలు తెలిపారు..  కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా కృషి చేస్తే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనం ఉంటుందన్నారు.

Back to Top