రామచంద్రపురం: ‘నాకు రాజకీయ విలువలు ఉన్నాయి. వైయస్ఆర్సీపీని విడిచి వెళ్లి వెన్నుపోటు పొడవలేను. నేను వైయస్ఆర్సీపీలోనే కొనసాగుతాను...’ అని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టంచేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు కలలో కూడా పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే పని చేస్తానని, వైయస్ఆర్సీపీలోనే ఉంటానని స్పష్టంచేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాసి నైతిక విలువలను దెబ్బతీయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నైతిక విలువలను కాపాడే విధంగా పత్రికలు వార్తలు ప్రచురించాలని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేయవద్దని హితవుపలికారు.