కియా ఎక్క‌డికీ త‌ర‌లిపోవ‌డం లేదు

త‌ప్పును క‌ప్పిపుచ్చుకోవ‌డానికి టీడీపీ దుష్ప్ర‌చారం చేస్తోంది

లోక్‌స‌భ‌లో ఎంపీ మిథున్‌రెడ్డి

ఢిల్లీ: కియా పరిశ్రమ ఎక్కడికీ తరలిపోవడం లేదని, కావాల‌నే టీడీపీ దుష్ప్ర‌చారం చేస్తోంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ లోక్‌స‌భ ప‌క్ష నేత మిథున్‌రెడ్డి మండిప‌డ్డారు. లోక్‌స‌భ‌లో ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు ఉద‌య‌మే కియా ఎండీతో మాట్లాడాన‌ని, కియా ఎక్క‌డికి త‌ర‌లిపోవ‌డం లేద‌న్నారు. కియా మోటార్స్‌ తరలింపుపై టీడీపీ ఎంపీలు లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఆయన స్పీకర్‌ను కోరారు. చంద్రబాబు ప్రభుత్వం ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ పేరుతో డమ్మీ కంపెనీ రూ. 30 కోట్ల పెట్టుబడికి రూ. వెయ్యి కోట్ల విలువైన భూములు ఇచ్చింద‌ని, దీని గురించి ప్రశ్నిస్తే.. కియా పరిశ్రమ తరలిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తోందని మండిప‌డ్డారు. సేవ్ చంద్రబాబు, సేవ్ స్కామ్స్ అనే లక్ష్యంతో టీడీపీ మీడియాలో ప్రచారం నడుపుతోందని ఎంపీ మిథున్‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. 

తాజా వీడియోలు

Back to Top