వింజమూరు ఎంపీపీ ఎన్నికలో ఉద్రిక్తత

వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీలపై టీడీపీ గూండాల దాడి

నెల్లూరు జిల్లా: వింజమూరు మండలంలో నిర్వహించిన ఎంపీపీ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్తున్న వైయస్ఆర్‌సీపీ  ఎంపీటీసీల కారుపై టీడీపీ గూండాలు దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ దాడికి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులే కారణమని వైయస్ఆర్‌సీపీ  నేతలు ఆరోపిస్తున్నారు. ఎంపీపీ ఎన్నికలో ఓటేయడానికి వెళ్తున్న సమయంలో ఎంపీటీసీలను అడ్డుకుని దాడి చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. టీడీపీ గూండాల దాడిలో మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇదే సమయంలో వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీ మల్లికార్జున్‌ను టీడీపీ వర్గీయులు కిడ్నాప్ చేసినట్లు పార్టీ నేతలు ఆరోపించారు. మరోవైపు, మరో ఎంపీటీసీని పోలీసులు నిర్బంధించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అధికార పార్టీకి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని వైయస్ఆర్‌సీపీ  నేతలు మండిపడ్డారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే వర్గీయులు వీరంగం సృష్టించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాల్సిన సమయంలో అధికార పార్టీ నేతల బెదిరింపులు, దాడులు ప్రజాస్వామ్యానికి మచ్చగా మారాయని వైయస్ఆర్‌సీపీ  తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై వెంటనే స్వతంత్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాల్సిన ప్రభుత్వమే దానిని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Back to Top