కిరణ్ కుమార్‌రెడ్డి చిత్తుగా ఓడిపోవడం ఖాయం

మాజీ సీఎంపై ఎంపీ మిథున్‌రెడ్డి ఫైర్‌

అన్న‌మ‌య్య జిల్లా: ఆస్తులు కాపాడుకోవడానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరాడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి మండిప‌డ్డారు. సీఎంగా పనిచేసిన కాలంలో ఆయన వేల కోట్లు అక్రమంగా సంపాదించారు. ఆ అక్రమ సంపాదన పరిరక్షణ కోసమే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ చెంత చేరాడ‌ని ఆరోపించారు. సీఎంగా దిగిపోయిన తర్వాత ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియద‌న్నారు. సొంత నియోజకవర్గం పీలేరుకు కిర‌ణ్‌ 10 సంవత్సరాలుగా రాలేద‌న్నారు. కరోనా సమయంలో సొంత గ్రామం వాసులకు ఒక్క సహాయం కూడా చేయలేద‌ని విమ‌ర్శించారు. కేవలం తన స్వార్థం కోసం ఇప్పుడు బీజేపీ నుంచి రాజంపేట ఎంపీ స్థానంకు పోటీ చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈ ఎన్నిక‌ల్లో కిరణ్ కుమార్‌రెడ్డి చిత్తుగా ఓడిపోవడం ఖాయమ‌ని హెచ్చ‌రించారు. సొంత గ్రామ వాసులకు న్యాయం చేయని కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ ప్రజలకు ఏ మేలు చేస్తాడని మిధున్‌రెడ్డి ప్ర‌శ్నించారు.

Back to Top