సీఎం వైయస్‌ జగన్‌ను కలిసిన ఎంపీ గురుమూర్తి

తాడేపల్లి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో విజయం సాధించిన డాక్టర్‌ ఎం. గురుమూర్తి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను ఎంపీ గురుమూర్తితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిశారు. ఈ మేరకు ఎంపీ అభ్యర్థిగా పార్టీ తరఫున నిలబెట్టడంతో పాటు భారీ మెజార్టీతో గెలిపించినందుకు సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా తిరుపతి ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి గురుమూర్తి విజయం కోసం సమష్టిగా పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం వైయస్‌ జగన్‌ అభినందించారు. 

తాజా వీడియోలు

Back to Top