తిరుపతి: రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని తిరుపతి వైయస్ఆర్‌సీపీ ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి పేర్కొన్నారు. శనివారం సత్యవేడు నియోజకవర్గం గాజుల పెళ్లూరు, సంతవేలూరు గ్రామస్థులు పలు సమస్యలను ఎంపీ గురుమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. గతంలో 1971 లో ఉమ్మడి వ్యవసాయ చేసుకునేందుకుగా భూమిలేని పేద ఎస్సీ రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన సి.జె.ఎస్.ఎఫ్ భూములు ఇచ్చారని, ఆ భూములు వీరి అనుభవం లో ఉన్నాయి కాని రైతుల పేరులో పాసుబుక్ లు, ఎలాంటి రెవెన్యూ రికార్డులు లేనందు వలన రైతులు వ్యవసాయ రుణాలు, ప్రభుత్వ పథకాలు అందుకోలేని పరిస్థితి ఉందని బి.ఎన్ కండ్రిగ మండలం గాజుల పెళ్లూరు పేద ఎస్సీ రైతులు ఎంపీ కి వినతి పత్రం సమర్పించారు. వరదాయపాలెం మండలం సంతవేలూరు ఎస్సి కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం గురించి చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉందని. త్వరలోనే మంజూరు చేసే దిశగా చర్యలు వేగవంతం అయ్యాయని ఎంపీ తెలిపారు. అయ్యావరపాలెం కాలువ నుంచి సంతవేలూరు పెద్ద చెరువుకి ఇది వరకే ఉన్న ఫీడర్ కాలువలో పూడిక తీయించెందుకు సహకరించాలని వినతి పత్రం సమర్పించారు. సమస్యలు అన్నీ విన్న ఎంపీ గురుమూర్తి గారు త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు తీసుకొనేలా అధికారులను అదేశిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీని ఆయా గ్రామాల ప్రజలు సత్కరించారు.