వైయ‌స్ జగన్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు 

  
వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు పోతుల సునీత‌

అర్హతే ప్రామాణికంగా సుపరిపాలన
 
వైయ‌స్ జగన్ ను మరోసారి ఆశీర్వదించండి

ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌డ‌ప గ‌డప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం

ఉరవకొండ:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో ప్ర‌తి ఇంటికి సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ఇన్‌చార్జ్ వై.విశ్వేశ్వ‌ర‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో పోతుల సునీత పాల్గొని ఇంటింటా ప‌ర్య‌టించారు. ఈ సందర్బంగా పోతుల సునీత‌ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునే నూతన ఒరవడికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను ఎలా కత్తిరించాలా అనే ఆలోచనతో పరిపాలన చేస్తే ..నేడు మన జగనన్న ప్రభుత్వం అర్హులను వెతికి మరీ లబ్ధి చేకూర్చుతోందన్నారు. పారదర్శక పాలన అంటే ఇదే అని పేర్కొన్నారు.ఇన్ని మంచి పనులు చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ని ముఖ్యమంత్రి గా మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను వారు కోరారు.   

Back to Top