గిరిజనులకు సెంటు భూమైనా ఇచ్చావా చంద్రబాబూ..? 

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు  

గిరిజనుల ద్రోహి చంద్రబాబుకు మళ్లీ పరాభవం తప్పదు. 

చంద్రబాబును గిరిజనులు ఎప్పటికీ నమ్మరు: ఎమ్మెల్సీ కుంభా రవిబాబు

అసత్యప్రచారానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు

చంద్రబాబు గిరిజన ద్రోహి..కనీసం గిరిజన శాఖకు మంత్రిని కూడా పెట్టలేదు

అలాంటి బాబు అరకులో గిరిజనులపై ప్రేమ నటిస్తున్నాడు

గిరిజనులకు పోడు భూములను పంచిపెట్టిన ఘనత జగన్‌ గారిదే.

వైయ‌స్ జగన్ సారథ్యంలో ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీ, ఇంజనీరింగ్‌ కాలేజీ, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు.

గిరిజనులు జగన్‌ గారిని ప్రేమిస్తున్నారని ఓర్వలేక చంద్రబాబు దిగజారుడు మాటలు

ప్రతి గిరిజన నియోజకవర్గాన్నీ గెలిపించి జగన్ గారికి గిఫ్ట్ ఇస్తాం.

విశాఖ పరిపాలన రాజధాని అంటే ఓర్వలేక చంద్రబాబు విమర్శలు.

టీడీపీ హాయంలో గంజాయిని ప్రోత్సహిస్తే...వైయ‌స్ జగన్ వారికి ప్రత్యామ్నాయ ఉపాధిని చూపారు: ఎమ్మెల్సీ కుంభా రవిబాబు. 

తాడేప‌ల్లి: నీ 14 ఏళ్ల పాలనలో గిరిజనులకు సెంటు భూమైనా ఇచ్చావా అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు గిరిజన ద్రోహి అని అన్నారు. చంద్రబాబు ఏనాడూ గిరిజనుల గురించి ఆలోచన చేయలేదన్నారు. గిరిజనుల పేరెత్తే అర్హత  చంద్రబాబుకు లేదంటూ సీరియస్‌ కామెంట్స్‌ చేశారు.   బాబు అసత్య ప్రచారానికి బ్రాండ్‌ అంబాసిడర్‌. చెప్పిందే చెప్పి అదే నిజమని నమ్మించాలని చూస్తున్నాడు. గిరిజన ఎమ్మెల్యేపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు ఏనాడూ గిరిజనుల గురించి ఆలోచన చేయలేదు. చంద్రబాబు గిరిజన ద్రోహి. 14 ఏళ్లు సీఎంగా బాబు గిరిజనుల కోసం ఏం చేశాడు?. గిరిజన కార్పొరేషన్‌ వేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలేదన్నారు. ఆదివారం కుంభా ర‌విబాబు మీడియాతో మాట్లాడారు.

 ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మీడియాతో ఏం మాట్లాడారంటే:

అసత్య ప్రచారానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు:
– చంద్రబాబు అరకులో మీటింగు పెట్టి అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. 
– 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. 
– అసత్యప్రచారానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు. 
– చెప్పిందే చెప్పి ప్రజలను పక్కదారి పట్టించాలనే ప్రధాన ధ్యేయంతో ఆయన పనిచేస్తున్నాడు. 
– గిరిజన ప్రాంతాలకు, గిరిజన ప్రజలకు తన 14 ఏళ్ల ముఖ్యమంత్రి కాలంలో ఏం చేశాడో చెప్పాలి. 
– తన హయాంలో నాలుగున్నరేళ్లు గిరిజన శాఖకు మంత్రిని కూడా నియమించలేదు.
– ట్రైబల్‌ ఎడ్వైజరీ బోర్డు వేయలేదు..ట్రైకార్‌ వేయలేదు. గిరిజన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ను నియమించలేదు. 
– ఇవన్నీ కాకుండా గిరిజనులకు బుద్ధి లేదు అంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. 
గిరిజన ద్రోహి చంద్రబాబునాయుడు. అందుకే ఈ రాష్ట్రంలోని 7 అసెంబ్లీ, ఒక పార్లమెంటును వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీపీకి ఇచ్చారు. 
రాబోయే ఎన్నికల్లో కూడా మీకు ఇదే గతిపడుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క గిరిజనుడూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెంటే ఉన్నాడు. 
తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిలా జగన్ గారు కూడా గిరిజన ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. 
అలాంటి  నాయకత్వం మాకు కావాలి..అలాంటి డైనమిజం మాకు కావాలి. అందుకే రాష్ట్రంలోని ప్రజానీకం అంతా ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. 

గిరిజనులకు సెంటు భూమైనా ఇచ్చావా చంద్రబాబూ..?:
– 2006లో అటవీ హక్కుల చట్టం వస్తే..చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు సెంటు భూమి కూడా గిరిజనులకు ఇవ్వలేదు. 
– వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనల సక్షేమానికి దేశంలో ఎవరూ చేయని విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. 
– అడవుల్లో, కొడల్లో కోనల్లో నివసిస్తున్న గిరిజన ప్రజానీకానికి పోడు భూమి ఇచ్చిన ఘనత ఒక్క జగన్‌గారికే దక్కుతుంది. 
– చంద్రబాబూ..మీరు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు సెంటు భూమి ఇవ్వలేకపోయారో సమాధానం చెప్పాలి. 
– రాష్ట్రంలో 38 లక్షల మంది గిరిజనులు తమకు ప్రత్యేకమైన గిరిజన కమిషన్‌ కావాలని కోరుకుంటే..కనీసం చంద్రబాబు ఆలోచన కూడా చేయలేదు. 
– జగన్‌ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే గిరిజన కమిషన్‌ ఏర్పాటు చేసి దానికి నన్ను ఛైర్మన్‌గా చేసి మా హక్కులకు భరోసా కల్పించారు. 
– దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి రాని అద్బుతమైన ఆలోచనతో ట్రైబల్‌ యూనివర్సిటీ, ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీ, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు నిర్మాణం చేపట్టారు. 
– గిరిజనుల మరణాలపై శాశ్వితమైన పరిష్కారం కావాలనే పాడేరులో మెడికల్‌ కాలేజీ నిర్మాణం కొనసాగిస్తున్నారు. 
– రూ.400 కోట్లతో గిరిజన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం కొనసాగుతోంది. 
– ట్రైబల్‌ యూనివర్సిటీని 562 ఎకరాల్లో రూ.834 కోట్లతో సెంట్రల్‌ యూనివర్సిటీ నిర్మాణం సాగుతోంది. 
– చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయాలనిపించలేదా? చేతులు రాలేదా? 
– ఇవ్వాళ అరకు వచ్చి దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నాడు. 
– వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గిరిజన ప్రజల మనసులను ఆకట్టుకుంటుంటే ఓర్వలేక చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. 
– స్కూల్స్‌ నాడు నేడు కింద రాష్ట్రంలోని పాఠశాలలను దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా బాగు చేస్తున్నారు. 
– తరతరాలుగా అణచివేతకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంగ్లీషు మీడియం చదివించాలని పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. 
– తన హయాంలో గిరిజనుల అభ్యున్నతిపై కనీసం ఆలోచన చేయని చంద్రబాబు ఇప్పుడొచ్చి ఎన్నెన్నో మాటలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటే పొరపాటే. 

విశాఖ పరిపాలన రాజధాని అంటే ఓర్వలేక చంద్రబాబు విమర్శలు
– విశాఖను పరిపాలన రాజధాని చేస్తానంటే దాన్ని కూడా చంద్రబాబు విమర్శిస్తున్నారు. 
– ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క హైదరాబాద్ నగరం నుంచే 51.6 శాతం ఆదాయం వచ్చేది. 
– దానికి కారణం ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజానీకం. తమ సంపాదనంతా అక్కడే పెట్టుబడి పెట్టారు. 
– కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలాంటి సమస్యలు మళ్లీ రాకూడదని జగన్ గారు ఆలోంచారు. 
– అందుకే పరిపాలన వికేంద్రీకరణ చేయాలని ఆయన మంచి ఆలోచన చేశారు. 
– బాగా వెనుకబడిన ఉత్తరాంధ్రను పరిపాలన రాజధానిగా చేసి ముందుకు తీసుకెళ్లాలని భావించారు. దాన్ని ఓర్వలేక చంద్రబాబు మాట్లాడుతున్నారు. 
– చంద్రబాబు మీ నోటి నుంచి ఏనాడైనా నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనే మాట వచ్చిందా? 
– మీరు చేయలేని అన్ని కార్యక్రమాలు జగన్ గారు చేసి చూపిస్తున్నారు. 
– అందుకే రాష్ట్రంలోని అన్ని గిరిజన నియోజకవర్గాలను గెలిపించి జగన్ గారికి గిఫ్ట్ గా ఇస్తాం. 
– టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ దళారీ వ్యవస్థ ద్వారా గంజాయి సాగును విపరీతంగా ప్రోత్సహించారు. 
– వైయ‌స్ జగన్ గారు వచ్చాక గంజాయి సాగును అరికట్టడమే కాకుండా వారికి ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించారు. 
– మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా మీ నాయకులు గంజాయి సాగు చేశారో లెక్కలు తీస్తే తెలుస్తుంది. 
– అక్కడి శాసనసభ్యులపై మీరు చేసిన అనుచితమైన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. 

Back to Top