గుర్రం చలపతికి హోం మంత్రి అనిత క్షమాపణ చెప్పాలి 

ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్  డిమాండ్‌

ప్ర‌కాశం జిల్లా:  గుర్రం చ‌ల‌ప‌తికి హోం మంత్రి అనిత క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని య‌ర్ర‌గొండపాలెం వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ డిమాండ్ చేశారు. హోం మంత్రి అనితమ్మ.. నా నియోజకవర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని గుర్రం చలపతి పేరు మీరు అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఒక అసత్యపు ప్రచారాన్ని మీరు తీసుకుని కమ్మ కులంలో కూడా పెరుగుతున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక ఆక్రోషంతో మీ చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.. ఆ బిడ్డను క్షమాపణ కోరాల‌ని సూచించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న ఓ వీడియో విడుద‌ల చేశారు.

ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్ ఏమ‌న్నారంటే..
 నా నియోజకవర్గంలోని త్రిపురాంతకం మండలం మేడపి గ్రామానికి చెందిన గుర్రం చలపతి కమ్మ సామాజిక వర్గానికి చెందిన కులస్తుడు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైయ‌స్ జ‌గ‌న్‌ గారికి వీరాభిమాని. అలాంటి వ్యక్తి మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులను, మీ కూటమి నేతలు చేస్తున్నటువంటి దాడులపై, దోపిడీలపై సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టాడని ముందు వెనుక చూసుకోకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యతను, హోం మంత్రిగా ఉన్నానని బాధ్యతను మరిచి మీరు చేసినటువంటి ఈ దిగజారుడు వ్యాఖ్యలు మీ  ప్రభుత్వ పనితీరుని అవివేకాన్ని ఎత్తిచూపుతున్నాయి.

ఒక వ్యక్తి కులాన్ని ఉద్దేశించి నిండు శాసనసభలో కులాన్ని మార్చి, పేరును మార్చి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి తెరలేపాయి.

దళిత నాయకులైనటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్ల తోటి చంద్రబాబు నాయుడు చేపిస్తున్నటువంటి దిగజారుడు రాజకీయానికి మీ వ్యాఖ్యలు నిదర్శనం.

ఆ బిడ్డ ఆధార్ కార్డ్, గ్రామం తన కుటుంబ వివరాలను తెలియజేశారు, ఆ వివరాలను మీ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ లలో చెక్ చేసుకోండి. నేటివిటి సర్టిఫికెట్ కు సంబంధించి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయడం కూడా జరిగింది అందుబాటులో ఉన్నాయి. ఇవాళ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద పడి ఏడుస్తున్నటువంటి మీకు కోర్టు మొట్టిక్కాయలు వేసి సిబిఐ కి అప్పగించినప్పటికీ సుమోటోగా ఇంకా బుద్ధి తెచ్చుకోల.

పద్ధతి మార్చుకోండి బయటకి రండి గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోండి. 
మీరు అడుగుతున్నటువంటి ఎమ్మెల్యే పేరు అడిగారు కచ్చితంగా వారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నుంచి నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా.. స్థానిక ఎమ్మెల్యే గా ఉన్నటువంటి నేను గడచిన 15 నెలల్లో ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపిన ఒక్క ఫైలు శాంక్షన్ అయినట్లు చూపించగలరా? అసెంబ్లీ సాక్షిగా మీరు చేస్తున్నటువంటి లెక్కలపై కావచ్చు, అప్పులపై కావచ్చు, ఉద్యోగాలపై కావచ్చు లేదా వైయ‌స్ఆర్‌సీపీపై చేస్తున్న అసత్య ఆరోపణలపై కావచ్చు ఇవన్నీ తప్పులు తడక అని చెప్పడానికి ఉదాహరణగా ఈ వ్యవహారం కనబడుతుంది. కచ్చితంగా మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి వాటిని నిరూపించాలి లేనిచో వెంటనే ఆ బిడ్డకు క్షమాపణలు చెప్పాలి.

ఎంత దుర్మార్గం ఎంత అవివేకంగా ఈ ప్రభుత్వ నడుస్తుందని చెప్పడానికి ఇది ఒక మచ్చుతునక అయినటువంటి ఉదాహరణ.

మీ ఐ-టీడీపీ, తెలుగుదేశం పార్టీకి పనిచేసినట్లుగా రెడ్లుగా మార్చుకుని పేర్లు ఐడీలు క్రియేట్ చేసుకుని మా ప్రభుత్వం ఉన్నప్పుడు దొంగ ప్రచారాలు చేసినట్లుగా వ్యక్తిత్వాన్ని ప్రతి ఒక్కరు చంపుకుంటారని అనుకుంటే అది మీ అవివేకం. హుందాగా రాజకీయం చేయడం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  సిద్ధాంతం.

మీలాగా చిరంజీవి ని అడ్డుపెట్టుకొని కాపు కులాన్ని రెచ్చగొట్టి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని అబండాలు వేసి రాజకీయంలో లబ్ది పొందాలని వైయ‌స్ జ‌గ‌న్‌ ఎప్పటికీ అనుకోల. అందుకే  వైయ‌స్ జ‌గ‌న్‌ అంటే ఒక బ్రాండ్ ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు అంటే ఒక మోసం ఒక వెన్నుపోటు.

Back to Top