నంద్యాల: రాజకీయాల్లో ఉన్నంతవరకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటామని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల బహిరంగసభలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి మాట్లాడుతూ.. మనమంతా చొక్కా చేతులు మడత పెడదామా. వైయస్ జగన్ ను రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మీరు సిద్ధమా?. నంద్యాల పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాలు, ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి మీరంతా సిద్ధమా?. నా దమ్ము, నా ధైర్యం, నా బలుపు మన జగనన్న. ఈ కటౌట్ మన వెనుక ఉన్నంతవరకు మనకు భయమనేది డిక్షనరీలో ఉంటుందా? మనల్ని ఎవరైనా భయపెట్టగలుగుతారా?. రెండేళ్లు కరోనా ప్రభావం తర్వాత కేవలం మూడేళ్లలోనే మన నంద్యాల అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఈరోజు నంద్యాలను జిల్లా చేశాం. నంద్యాలకు రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ, ఆస్పత్రిని తీసుకొచ్చాం. నంద్యాల దాహార్తిని తీర్చడానికి రూ.154 కోట్లతో అమృత్ పథకాన్ని పూర్తి చేశాం. కుందు వెడల్పు కార్యక్రమం చేశాం, నేషనల్ హైవే తీసుకొచ్చాం, పార్కులు కట్టాం, అర్బన్ హెల్త్ సెంటర్లు, సీహెచ్‌సీలు కట్టాం, గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, పేదలందరికీ ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణానికి లోన్లు, మిర్చి యార్డు, రైతన్నలకు గిట్టుబాటు ధరలు కల్పించాం. వర్షాలు లేకపోయినా సరే పంటలు ఎండిపోకుండా రెండుసార్లు పంటలు పండించిన ఘనత జగనన్న ప్రభుత్వానిది. గత 17 ఏళ్లలో నంద్యాలలో చేయని అభివృద్ధి మనం మూడేళ్లలోనే చేశాం. జగనన్న మీ ముందు కొన్ని కోరికలు, డిమాండ్లు ఉంచుతున్నాను. ఒకటి.. నంద్యాలను మున్సిపల్ కార్పొరేషన్ చేయడం, రెండు.. నుడా చేయడం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అవుటర్ రింగ్ రోడ్డు, భూసేకరణ చేసి పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాజకీయాల్లోకి ఒకటే డిసైడ్ అయ్యి వచ్చాం. రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాం, కొనసాగుతాం లేకపోతే రాజకీయాల నుంచి తప్పకుంటాం కానీ జగనన్నను మాత్రం వదలేది లేదు. ఈరోజు ఇక్కడికి వచ్చిన జనం, బయట చూసిన జనం, వారు చూపిన ప్రేమానురాగాలు చూస్తుంటే మనస్సు ఉప్పొంగి పొర్లుతోంది.