బాధితుల‌కు ప‌రిహారం పంపిణీ చేసిన ఎమ్మెల్యే రోజా

చిత్తూరు: ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు న‌ష్ట‌పోయిన బాధితుల‌కు ఎమ్మెల్యే ఆర్కే రోజా ప‌రిహారం పంపిణీ చేశారు. విజయపురం మండలం కు సంబందించి లో భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వం త‌ర‌ఫున ఎమ్మెల్యే ప‌రిహారం అంద‌జేశారు. పన్నూరు సబ్ స్టేషన్  నందు  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న 29 మంది అందులో 26 గుడిసె గృహాలకు ఒక్కొక్కరికి 4100.00 చొప్పున, 3 పక్కా గృహాలకు ఒక్కొక్కరికి రూ.5200.00 చొప్పున 29 మందికి ప్రభుత్వం అందించే నగదు సహాయాన్ని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చేతుల మీదుగా అందించారు. నిండ్ర మండలం లో భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లకు కూడా ప్రభుత్వ సహాయం అందించారు.   
పుత్తూరు మండలం తొరూరు పంచాయతీ సర్పంచ్ భర్త కృష్ణమూర్తికి అనారోగ్యకారణంగా సర్జరీ జరిగింది. విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్యే రోజా కృష్ణ‌మూర్తి ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించారు. 

Back to Top