అగ్రిగోల్డ్ బాధితురాలికి అండగా నిలిచిన ఎమ్మెల్యే ఆర్కే  

మంగ‌ళ‌గిరి : అగ్రిగోల్డ్ బాధితురాలికి మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి అండ‌గా నిలిచారు. మంగ‌ళ‌గిరి ప‌ట్ట‌ణంలోని శాలివాహన పేటలో ఎమ్మెల్యే ఆర్కే గురువారం గడపగడప కార్యక్రమంలో పర్యటించారు.ఈ సమయంలో అగ్రిగోల్డ్ బాధితురాలు  కోటేశ్వ‌రి, వీరాంజ‌నేయులు తన గోడు ఎమ్మెల్యేకు వినిపించారు.  దినసరి కూలీ ప‌నులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామ‌ని, సంపాదించిన దాంట్లో కొంత అగ్రిగోల్డ్ కు రూ.7500 చెల్లించామని తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు విడతలవారీగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. ఆ సమయంలో కోటేశ్వరి నిండు గర్భిణీ కావడంతో నమోదు చేసుకోలేకపోయింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆర్కే బాధితురాలు చెల్లించిన రూ. 7500 త‌న‌ సొంత డ‌బ్బులు అందించి అండగా నిలబడ్డారు.దీంతో ఎమ్మెల్యేకు బాధిత కుటుంబం కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

Back to Top