‘గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్రే కీలకం’

ఎమ్మెల్యే ఆర్కే రోజా

చిత్తూరు:  గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్రే కీలకమని న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు.  చిత్తూరు జ ఇల్లా నగరి పి.సి.ఎన్. ప్రభుత్వ జూనియర్ కళాశాల లో గురువారం  నియోజకవర్గ స్థాయి పంచాయతీ సర్పంచుల శిక్షణా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన  సర్పంచ్‌లు విధులు, బాధ్యతల గురించి తెలుసుకుని వారే స్వయంగా గ్రామపాలన సాగించాలని సూచించారు.  ప్రధానంగా గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి సారించాలని, ప్రజలకు రక్షిత మంచినీటిని అందించేందుకు కృషి చేయాలని సూ చించారు. ప్ర‌తి ఒక్క గ్రామంలో మొక్క‌లు నాటి, వాటి సంర‌క్ష‌ణ బాధ్య‌త‌ను స్వీక‌రించాల‌ని పిలుపునిచ్చారు.   కార్య‌క్ర‌మంలో చిత్తూరు డివిజనల్ పంచాయతీ అధికారిణి రూపరాణి, ఎంపీడిఓలు రామచంద్ర, ఇందిర, సతీష్ నియోజకవర్గంలోని సర్పంచులు పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top