సీఎం వైయస్‌ జగన్‌ కమిట్‌మెంట్‌ ఉన్న నాయకుడు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
 

అమరావతి: ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే చెల్లిందని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం యువతకు పెద్దపీట వేసిందన్నారు. సుదీర్ఘ పాదయాత్ర చేసి అన్ని మీటింగ్‌లలో స్థానికులకు అవకాశాలు కల్పిస్తామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారని గుర్తుచేశారు. మొదటి బడ్జెట్‌ మీటింగ్‌లోనే పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించే బిల్లును తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. కమిట్‌మెంట్‌ ఉన్న నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని, ఆయన నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు చరిత్రాత్మకమన్నారు. ఉపాధి కోసం యువత వలస పోకుండా ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి, సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలను చాలా దగ్గరగా చూశానని, ప్రజల అభివృద్ధి కోసం వైయస్‌ఆర్‌ పనిచేశారన్నారు. ఆయన తనయుడు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ప్రజల క్షేమం కోసం అడుగులు వేస్తున్నారన్నారు. 50 రోజుల పాలనలోనే ప్రజలకు ఉపయోగపడే అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను వృద్ధిలోకి తీసుకురావాలని తపనపడుతున్నారన్నారు.

Back to Top