వైయస్ఆర్ జిల్లా: హత్యలు చేసేవారంటూ... రాయలసీమ, కడప జిల్లా ప్రజలను తీవ్రంగా అవమానించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పై ప్రొద్దుటూరు వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను ప్రజా ప్రజాప్రతినిధి కాకపోయి ఉంటే, ఓ రాజకీయ పార్టీలో ఎమ్మెల్యే కాకుండా ఉంటే.. ప్రజాస్వామ్యంలో లేకుండా ఉంటే.. సోము వీర్రాజు నాలుక కోసేవాడినంటూ హెచ్చరించారు. రాయలసీమ ప్రజలకు తక్షణమే వీర్రాజు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘రాయలసీమ ప్రజలను, కడప జిల్లా ప్రజలను మీ మాటలతో బాధిస్తావా. కడప జిల్లాకు చెందిన ప్రజలు మనుషుల్ని చంపటానికే పనికి వస్తారా? మరిదేనికి పనికిరారా? ఇక్కడ పుట్టే ప్రతి మనిషి ఫ్యాక్షనిస్టు, హత్యలు మాత్రమే చేస్తారా?మరేమీ తెలియదా..' ఒళ్లు కొవ్వు ఎక్కి ఇటువంటి మాటలు మాట్లాడిన మిమ్మల్ని ఏమనాలి? . మీ వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. "నేను రాజకీయ పార్టీకి శాసన సభ్యుడిగా, ప్రజాస్వామ్యంలో లేకుండా ఉండి ఉంటే.. నా తల్లి, మాకు జన్మ నిచ్చిన కడప గడ్డ నాకు సంస్కారాన్ని నేర్పకుండా ఉండి ఉంటే.. మీరు మాట్లాడిన మాటలకు ఈపాటికి మీ నాలుక కోసి ఉండాలి." ఇంకా మేము సంస్కారంగా మాట్లాడుతున్నామంటే.... అది ఈ జిల్లా గొప్పతనం. సంస్కారం, సభ్యత మరిచి యావత్ రాయలసీమ ప్రాంతాన్ని బాధిస్తావా? అంటూ సోము వీర్రాజు పై రాచమల్లు ధ్వజమెత్తారు.