పవన్ కళ్యాణ్ పిచ్చి పరాకాష్ఠకు చేరింది

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి  కొలుసు పార్థసారథి 

పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యంలో ఉండదగిన వ్యక్తేనా..!?

 పవన్ కళ్యాణ్ గంట మాట్లాడి ఏం ప్రశ్నించాడు

 ఏం ప్రశ్నించావో.. నీకైనా అర్థమవుతోందా పవన్ కళ్యాణ్?

 రాష్ట్ర పరిస్థితుల మీద కనీస అవగాహన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్

 చిరంజీవి వల్ల పైకొచ్చి పవన్ ప్రగల్భాలు

 కమ్మ సామాజికవర్గం ఎట్టిపరిస్థితుల్లో మాకు వర్గ శత్రువులు కాదు

 లేని వర్గ శత్రువులను సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలంటే కుదరదు

 వర్గ శత్రువులను చూసి శ్రీ జగన్ కు 151 సీట్లు రాలేదు

 తుని ఘటనపైనా ఆరోపణలా..?*

 అధిక వర్షాలు, గత ప్రభుత్వ పనితీరు వల్ల రోడ్లు పాడైంది వాస్తవమే.. రోడ్లపై పవన్ షోలు ఎందుకోసం..?

 కేంద్రంలోని బీజేపీ నాయకత్వమే శ్రీ జగన్ పరిపాలనను మెచ్చుకుంటోంది

 బీజేపీవి పాచిపోయిన లడ్డూలు అంటాడు.. ఢిల్లీ వెళ్ళి ఆ లడ్డూలే మళ్ళీ తింటాడు

 అటు సినిమాల్లో.. ఇటు రాజకీయాల్లోనూ పవన్ ది ఫ్లాప్ షోనే

 పవన్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టే

 తాడేప‌ల్లి: జ‌న‌సేన అధ్య‌క్షుడు పవన్ కళ్యాణ్ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి  కొలుసు పార్థసారథి విమ‌ర్శించారు. ఇవాళ ఆయ‌న నిర్వ‌హించిన షో
అట్ట‌ర్ ప్లాప్ అయ్యింద‌ని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తానేదో ప్రశ్నించానని, దానికి సమాధానం చెప్పడం లేదని పవన్‌ కల్యాణ్‌ అంటున్నాడు. అసలు నువ్వు ఏం ప్రశ్నించావు, ఏం అడిగావో నీకు అయినా అర్థం అవుతుందా పవన్ తంటూ నిల‌దీశాడు. బుధ‌వారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో పార్థ‌సార‌ధి మీడియాతో మాట్లాడారు.

 పవన్‌ కల్యాణ్‌ తన సోదరుడు చిరంజీవిగారి పేరుతో పైకి వచ్చి ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారు.  ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. మీ నాన్న మీకు ఏమిచ్చారో, ఇవ్వలేదో మాకైతే తెలియదు కానీ... పవన్‌కు ఇటువంటి పిచ్చి ఎక్కడ నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. నీ మాటలు పిచ్చితనంగా ఉన్నాయి, ఎక్కడా రాష్ట్రానికి సంబంధించి కానీ, అభివృద్ధికి సంబంధించికానీ దిక్సూచీ లా లేవు. నీ మైండ్‌లో రాష్ట్ర ప్రజల పట్ల అవగాహన ఉన్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. కేవలం పిచ్చి ఒక్కటే కనిపిస్తోంది.  ముఖ్యమంత్రి కావాలని ఆశలు, కలలు కంటున్న వ్యక్తి భావజాలం, ఆ వ్యక్తి బాడీ లాంగ్వేజ్‌ ఏంటో ప్రజలకు బాగా  అర్థమైంది. 

రాష్ట్ర ప్రభుత్వాన్ని తానేదో ప్రశ్నించానని, దానికి సమాధానం చెప్పడం లేదని పవన్‌ కల్యాణ్‌ అంటున్నాడు. అసలు నువ్వు ఏం ప్రశ్నించావు, ఏం అడిగావో నీకు అయినా అర్థం అవుతుందా పవన్‌ కల్యాణ్‌? గంటకు పైగా మాట్లాడినా అందులో ప్రశ్నలేమీ లేవు. స్టోరీ రైటర్‌ వచ్చి మీకు సినిమా కథ చెబితే ఏవిధంగా ఉంటుందో అలా ఉంది తప్పించి, ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రశ్న వేయలేదనే విషయం మీకు మాత్రం అర్థం కావడం లేదు కానీ, మిగతా రాష్ట్ర ప్రజలందరికీ అర్థం అవుతుంది.

 పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లోకి కొత్త ఫిలాసపీ తెచ్చారు. వైయస్సార్‌ సీపీకి కమ్మవారు వర్గ శత్రువులు అట. పవన్‌ ఈ సమాజాన్ని ఏదిశగా తీసుకువెళ్లాలనుకుంటున్నాడు. అంటే లేని వర్గ శత్రువును సృష్టించి, వర్గాల మధ్య పోరు సృష్టించి ఆ వివాదాల నుంచి రాజకీయ లబ్ది పొందాలనుకుంటే నీకు ఏం శిక్ష వేయాలో ప్రజలకు తెలుసు. వర్గ శత్రువును చూసి కాదు జగన్‌ మోహన్‌ రెడ్డిగారికి 151 సీట్లు ఇచ్చింది. కమ్మవారు వైయస్సార్‌ సీపీకి ఎట్టి పరిస్థితుల్లో వర్గ శత్రువులు కాదు. ఈ  ప్రభుత్వంలో, మంత్రివర్గంలో కూడా ముఖ్యభూమిక వహిస్తున్నవారిలో కమ్మవారు ఉన్నారు. సాక్షాత్తూ సీఎంగారు అసెంబ్లీ హాల్‌లోనే చెప్పారు. కొడాలి నాని, తలశిల రఘురాం లాంటి ఎందరో తన వెన్నంటే ఉన్నారని చెప్పారు. జగన్‌ మోహన్‌ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చింది నీవు అనుకుంటున్నట్లు పిచ్చితనంతో కాదు. ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు న్యాయం జరుగుతుంది. సామాజిక న్యాయం అమలవుతుందనే.  "జగన్‌ మోహన్‌ రెడ్డిగారి కుటుంబం ఏదైనా మాట ఇస్తే ఆ మాటను  నిలబెట్టుకుంటారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. మా పిలల్ల భవిష్యత్‌ బాగుంటాయనే ఉద్దేశంతో"  ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. 

 బుద్ధిలేని కొత్త ఫిలాసఫీని రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకు రావొద్దు పవన్‌ కల్యాణ్‌. ప్రజాస్వామ్యం మీద అవగాహన ఉండి మాట్లాడుతున్నావా? లేకుంటే సినిమాల్లో హీరోలాగా స్టిల్స్‌ ఇచ్చి, పంచ్‌ డైలాగ్స్‌ ఇచ్చి తప్పెట్లు, ఈలలు కొట్టించుకుని సంతోషపడుతున్నావో అర్థం కావడం లేదు. కొంతసేపు యుద్ధం అంటాడు, కొంతసేపు సాయుధ దళంలాగా ఉండాలి, పోరాటం చేయాలనిపిస్తుందని అంటాడు. అసలు ఇలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండాల్సినవాడా.. కాదా అనేది ప్రజలు కూడా ఆలోచించాలి. 

ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరగుతుందని పవన్‌ కల్యాణ్‌ అడుగుతున్నాడు. బహుశా ఆయన కుటుంబం ఈ దేశానికి సంబంధించినవాళ్లు కాదు. పవన్‌ ఏపీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఎక్కడో పక్కరాష్ట్రంలో సెటిల్‌ అయిపోయాడు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద అవగాహన లేని వ్యక్తి పవన్‌ కల్యాణ్‌.

 వైయస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిన్నర నుంచి రాష్ట్రంలో కరోనా కొట్టుమిట్టాడుతున్న విషయం మీకు తెలియదా పవన్‌ కల్యాణ్‌.. ఈ రాష్ట్రమే కాదు భారతదేశంతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా కరోనాతో కొట్టుమిట్టాడుతూ, ఆర్థికంగా ఏవిధంగా కుదేలు అవుతున్నాయో తెలియదా పవన్‌. అయినా కూడా ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉపాధి లేక పేద ప్రజలు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే... ఏపీలో మాత్రం పేదలకు దాదాపు ఆరుకోట్ల 81లక్షల ప్రయోజనాలు కలిగేలా నేరుగా రూ. లక్ష కోట్లు పైబడి  ఫలాలు అందాయి. ఆస్తిరూపంలోనో, వస్తు రూపంలోనో రాష్ట్ర ప్రజలుకు అందాయి.

 2016లో జరిగిన తుని ఘటనపై మాట్లాడటానికి సిగ్గుండాలి పవన్‌ కల్యాణ్‌కు. అప్పటి ప్రభుత్వంలో నువ్వుకూడా భాగస్వామిగా ఉన్నావ్‌ కదా, మరి నీవు ఏం చేశావ్‌? వైయస్సార్‌ సీపీ మూకలు రైళ్లు తగలబెట్టాయని మాట్లాడటానికి సిగ్గుందా అని అడుగుతున్నాను?  ఏవిధంగా మాట్లాడతావ్‌.. నాకు ఓపక్క కులం లేదంటావ్‌, మళ్లీ కాపులు నా కులం అంటావ్‌. ఏవిధంగా మాట్లాడుతున్నావో నీకు అయినా అర్థం కావడం లేదా. పవన్‌ పిచ్చి పరాకాష్టకు చేరినట్లు ఉంది.

 రోడ్లు బాగోలేవనేది వాస్తవమే. అధిక వర్షాల వల్ల, గత ప్రభుత్వం పనితీరు వల్ల రహదారులు కొంత ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవమే. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వనరులు అన్నీ దెబ్బతిన్నాయి, తగ్గాయి. అలాంటి పరిస్థితుల్లో పేదలు ఇబ్బందులు పడకూడదని, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడకూడదని లక్ష కోట్లు వారికి అందించాం. గత ప్రభుత్వంలో చంద్రబాబుతో అంటకాగిన పవన్‌... అప్పుడు రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్లు వేయకపోయిన విషయాన్ని ఎప్పుడైనా ప్రశ్నించారా? అప్పట్లో తట్టెడు మట్టి అయినా వేశారా? టీడీపీ సర్కార్‌ రోడ్లు వేయకపోవడంతో పాటు, ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు ఇబ్బందికరంగా మారాయానే దాన్ని మేము అంగీకరిస్తాం. మేమేమీ చూస్తూ ఊరుకోలేదు. రోడ్లకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్‌గారు ఇప్పటికే ఆర్‌అండ్‌బీకి ఒక రోడ్‌ మ్యాప్‌ ఇచ్చారు. ఆర్థిక వనరులు ఎక్కడ నుంచి ఎలా సమకూర్చాలి? ఆర్థిక వనరులు టైఅప్‌ చేసి, దాదాపు రూ. 2000కోట్లతో టెండర్లు పిలవడం తెలియదా పవన్‌ కల్యాణ్‌.

నటుడువి కాబట్టి ఆఖరికి రోడ్ల మీద కూడా నటించడానికి వచ్చావ్‌. ఎలాగు రాబోయే ఆర్నెల్లు, సంవత్సరంలో జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ప్రభుత్వం రోడ్లు వేయబోతుంది. కాబట్టి రోడ్ల మీదకు  వచ్చి కొద్దిసేపు క్లాప్‌ కొట్టించుకుని డ్రామా వేస్తే సరిపోతుందని భావించావా. అయితే నీ ఎత్తులేమీ ఇక్కడ పనిచేయవని చెబుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికే రోడ్లు నిర్మాణాలు, మరమ్మతులకు కార్యాచరణ చేపట్టింది.

వైయ‌స్ జ‌గ‌న్‌ మోహన్‌ రెడ్డిగారు వాస్తవవాది. అబద్ధాలు చెప్పి తప్పించుకోవడానికో, మసిపూసి మారేడుకాయ చేయడానికో ప్రయత్నం చేయని వ్యక్తి.  ఆ వ్యక్తిత్వం ఉన్నది కాబట్టే రోడ్లు బాగోలేదు, ఇబ్బందికరంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారే అంగీకరించారు. ఈరోజు అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ, సచివాలయాలు బ్రహ్మాండంగా ఉన్నాయని అని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే మెచ్చుకున్న పరిపాలనను జగన్‌ మోహన్‌ రెడ్డిగారు చేస్తున్నారు.

 పవన్‌ కల్యాణ్‌ నిమిషానికో మాట,  ఏ నిమిషంలో ఏదైనా మాట్లాడగలరు. కారణం రాష్ట్ర ప్రజలు అయాచితంగా ఇచ్చిన స్టార్‌డమ్‌ను అడ్డుపెట్టుకుని ఏదైనా చేయగలరు అని ఆయన నమ్మకం. ఏ మనిషితో అయినా, ఏ పార్టీతో అయినా ఆయన ఉండేది కొంతకాలమే. ఒకమాట అనేసి వెంటనే మాట మార్చుతాడు. బీజేపీ వాళ్ళు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అంటాడు.. మళ్లీ వాళ్లతోనే ఢిల్లీ వెళ్ళి అంటకాగుతాడు. ఇలాంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలకు అవసరమా అని ఆలోచించాలి.

 పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి 12 ఏళ్లు అయింది కనీసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేలను గెలిపించుకోలేనని ఫ్రస్టేషన్‌లో ఉన్నాడు. ఎందుకంటే పవన్‌ అన్నింటిలోనూ ఫెల్యూయిర్‌. రాజకీయాల్లో అట్టర్‌ ఫ్లాప్‌. సినిమాల్లో తన స్టార్‌డమ్‌ను అడ్డుపెట్టుకుని నిర్మాతలను ముంచేశాడు. సినిమారంగం మూలంగా ఆయన బాగుపడ్డాడు తప్ప, పవన్‌ కల్యాణ్‌ వల్ల సినిమా రంగం బాగుపడలేదని స్పష్టంగా చెప్పగలం. 

ఈ ప్రభుత్వం ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానం తీసుకువస్తే మీకేంటి నష్టం. బుక్‌ మై  షో లాంటి వెబ్‌సైట్లు వంద రూపాయిల టికెట్‌ మీద 12శాతం వరకూ వసూలు చేస్తున్నాయి. దీంతో ప్రేక్షకుడు ప్రతి టికెట్‌ మీద అదనంగా చెల్లించాల్సి వస్తోంది. పవన్‌ లాంటి హీరోలు, వీరి బంధువులు థియేటర్లు గుప్పిట్టో పెట్టుకున్నవాళ్లు... టికెట్లు బ్లాక్‌లో ఎంతకు అమ్ముకుంటున్నారో, ట్యాక్స్‌ ఎంత కడుతున్నారో, ఎన్ని బెనిఫిట్‌ షోలు వేసుకున్నారో లెక్కాపత్రం లేదు. ప్రేక్షకుల్ని దోచుకుంటున్న విషయం ప్రజలకు తెలుసు. దాన్ని క్రమబద్దీకరించాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేవలం 2శాతం మాత్రమే చెల్లించేలా వంద రూపాయిల టికెట్‌ను 102 రూపాయిలకు అందిస్తోంది. బ్లాక్‌ మార్కెటింగ్‌ లేకుండా ఎవరికి నష్టం లేకుండా చేయడం తప్పా అని అడుగుతున్నాం.

 నువ్వు మాట్లాడిన మాటలను ఫిల్మ్‌ ఛాంబర్స్‌ వాళ్లు కూడా వ్యతిరేకించారంటే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో‌. పవన్‌ కల్యాణ్‌ ఫ్రస్టేషన్‌ ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చి 12 ఏళ్లు అయినా ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేని దౌర్భగ్య పరిస్థితి. గత ఎన్నికల్లో తనకు తానే రెండుచోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా గెలవలేకపోయాడు. ఎవరైనా యుద్ధంలో నిలబడితే తన సైన్యం ఓడిపోయినా... వారికి స్ఫూర్తినిచ్చేలా నేను గెలవాలి, నా రాజ్యం గెలవాలనే తపన ఆఖరు వరకూ ఉండాలి కానీ, తన సైన్యం బలహీనపడుతుంటే తాను కూడా బలహీనపడాలని అనుకున్న సేనానిని, ఈయనను ఒక్కడినే చూస్తున్నాం.

 రేపటి రోజు ఏంచేయాలో కూడా పవన్‌కు అర్థం కాదు. బీజేపీతో కలిసి వెళితే పుట్టగతులు ఉండవు. తెలుగుదేశంతో కలుద్దామా అంటే తనను గౌరవించి నెత్తిన పెట్టుకునే కాపు వర్గం మన సామాజికవర్గాన్ని తాకట్టు పెడతారా అనే ఆలోచనతో ఛీత్కరిస్తారేమో అనే భయం ఆయనలో ఉంది. వీటన్నింటి ఫ్రస్టేషన్‌ కు ఆయన ఇవాళ మాట్లాడిన మాటలే ఉదాహరణ.

పవన్‌ మాట్లాడితే ఎంతసేపు ఈ రాష్ట్రంలో జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని, ఒక సామాజిక వర్గాన్ని కించపరిచి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాడు. హీరోలాగా తోలు వలుస్తాను?, మీ సంగతి చూస్తాను అంటూ కార్యకర్తల్ని రెచ్చగొడుతూ, వారినైనా కాపాడుకోవాలనే మాటలు చెబుతున్నాడు? ఏం చేస్తావు రాసుకుని? ఇది ప్రజాస్వామ్యమా? లేక ఉగ్రవాదులు పాలిస్తున్న ఆప్ఘనిస్తాన్‌ అనుకుంటున్నావా పవన్‌?

ప్రజాస్వామ్యాన్ని గౌరవించే రాష్ట్రం ఇది. నీకు ఈరాష్ట్రంలో స్థానం ఉంటుందని మేము భావించడం లేదు. నువ్వేదో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి అయిపోయినట్లు, ప్రజల్ని, కార్యకర్తల్ని ఉత్సాహపరచవచ్చేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను ఎప్పటికీ ఎన్నుకోరు, దగ్గరకు కూడా రానివ్వరు. కులాలు, సామాజిక న్యాయం గురించి నువ్వు మాట్లాడటమా..

 వైయ‌స్ జ‌గన్‌ మోహన్‌ రెడ్డిగారు కంటే సామాజిక న్యాయం చేసిన వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాం. కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారు ఉపముఖ్యమంత్రులుగా ఉన్నారు. అది కేవలం జగన్‌గారి వల్లే సాధ్యం అయింది. 

 కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జిల్లా పరిషత్‌ చైర్మన్లుగా తామే ఉండాలని కొన్ని వర్గాలు భావించాయి. అయితే ఓసీ రిజర్వేషన్‌ అయినా సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రిగారు బలహీనవర్గాలకు  చెందిన వ్యక్తిని జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా చేశారు. రాష్ట్రంలో ఏవిధంగా బలహీనవర్గాలకు మేలు జరుగుతుందో పవన్‌ కల్యాణ్‌ అర్థం చేసుకోవాలి. జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఏది అయితే చెప్పారో నవరత్నాల్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లి వారి ఆర్థిక పరిస్థితులకు మేలు చేస్తున్నారు. 

 జన సైనికులకు ఒకటే చెబుతున్నాం.. పవన్‌ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారిని ఈదినట్లే. ఒక రాజకీయ పార్టీ అంటే.. అన్ని సామాజిక వర్గాలు ఆ పార్టీలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలు సంతోషంగా ఉన్నాయి.
 

Back to Top