సీఎం వైయస్‌ జగన్‌ రైతుల కష్టాలు తీర్చారు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు అండగా నిలిచారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టారన్నారు. ఎమ్మెల్యే పద్మావతి మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాల్లోనే వేరుశనగ విత్తనాల పంపిణీ అభినందనీయమన్నారు. టీడీపీ పాలనలో విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. క్యూ లైన్లలో రైతులు చనిపోయినా చంద్రబాబు పట్టించుకోలేదని మండిపడ్డారు. సీఎం వైయస్‌ జగన్‌ రైతుల కష్టాలు తీర్చారని, కరోనా కష్టకాలంలోనూ రైతులకు పంట పెట్టుబడి సాయం అందించారన్నారు.
 

Back to Top