దళితులను వైయస్‌ జగన్‌ గుండెల్లో పెట్టుకున్నారు

 దళిత సంక్షేమానికి  బడ్జెట్‌లో న్యాయం

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున

అమరావతిః దళిత సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో న్యాయం జరిగిందని  వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. దళితులను వైయస్‌ జగన్‌ గుండెల్లో పెట్టుకున్నారు.ఎస్సీ కార్పొరేషన్‌ను మూడు విభాగాలుగా విభజించి ఆదుకుంటామని తెలిపారు.ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ను తూచా తప్పకుండా అమలు చేస్తామనడం  హర్షణీయమన్నారు.దివంగత మహానేత వైయస్‌ఆర్‌ పాలనలో లక్షల ఎకరాలు దళితులు,గిరిజనులకు పంచారన్నారు.ఎస్సీ,ఎస్టీ అక్కచెల్లెమ్మలకు పెళ్ళి కానుకగా రూ.లక్ష  ఇవ్వడం అభినందనీయమన్నారు.ఎస్సీ,ఎస్టీలకు 250 యూనిట్ల వరుకు ఫ్రీగా కరెంట్‌ ఇస్తామని వైయస్‌ జగన్‌ చెప్పారన్నారు.ప్రమాదాల్లో మరణించిన ఎస్సీ,ఎస్టీలకు రూ.5లక్షలు ఇస్తామని బడ్జెట్‌లో పెట్టారన్నారు.దళిత,గిరిజన రైతులకు కూడా వైయస్‌ జగన్‌ పెట్టుబడి సాయం ఇస్తామన్నారని తెలిపారు. 

Back to Top