బీజేపీకి జిన్నా టవర్.. బాబుకు దళితులు ఇప్పుడే గుర్తొచ్చాయ్.. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున 

 టీడీపీ-బీజేపీది నేలబారు, వికృత రాజకీయం*

 దళితుల అభివృద్ధి నిరోధక శక్తిగా చంద్రబాబు 

 రామకుప్పంలో లేని గొడవను బాబు సృష్టిస్తున్నాడు.. 

 టీడీపీ- బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు జిన్నా టవర్ గుర్తుకు రాలేదా..? 

 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు దళితులపై లేని ప్రేమ ఇప్పుడెందుకు ఒలకబోస్తున్నాడు 

  "ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా.." అన్నందుకు అంబేడ్కర్ విగ్రహం వద్ద బాబు ముక్కు నేలకు రాయాలి. 

విశాఖ‌:   రాష్ట్రంలో టీడీపీ -  బీజేపీ నేలబారు, వికృత  రాజకీయాలు చేస్తున్నాయి. ఎంతసేపటికీ వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వంపైన గుడ్డ కాల్చి నెత్తిన వేయాలనే విధంగా వీళ్ళ రాజకీయాలు ఉన్నాయ‌ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున అన్నారు.  2018 వరకు బీజేపీ వాళ్ళు చంద్రబాబుతో కలిసి అధికారం పంచుకుని అంటకాగారు. అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో ఇద్దరూ అధికారాన్ని పంచుకుని ఆహో.. ఓహో అని అన్నారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చేసరికి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని ప్రజలను మభ్య పెట్టాలని చూశారు. అయితే, విజ్ఞులైన ప్రజలు ఆ  రెండు  పార్టీలను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. నాలుగేళ్ళపాటు రాష్ట్రంలో అధికారంలో అంటకాగిన టీడీపీ-బీజేపీకి అప్పుడు గుర్తుకు రాని జిన్నా టవర్ ఇప్పుడు గుర్తుకు వస్తుందట. జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి రాగానే.. ప్రజల్లోకి వచ్చేందుకు ఏదో ఒక అంశం కావాలి కాబట్టి, జిన్నా టవర్ పేరుతో దీక్షలు, ధర్నాలు అంటున్నారు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తున్నారు. వీరికి ప్రజలు బుద్ధి చెప్పినా.. ఇంకా కనువిప్పు కలిగినట్టు లేదు. 

 ఏ పార్టీ అయినా, రాజకీయంగా ఎదగాలంటే.. ప్రజాపయోగ అంశాలను లేవనెత్తాలి. అటువంటివి ఏమీ లేకపోయే సరికి ఈరోజు బీజేపీకి జిన్నా టవర్ గుర్తుకొస్తే.. చంద్రబాబుకు దళితులు గుర్తుకొస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఐతే మరో అడుగు ముందుకు వేసి.. జిన్నా టవర్ ను పేలుస్తామని మాట్లాడటం అంటే, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఎక్కడ ఉన్నా.. అన్న అనుమానం ప్రజలకు కలుగుతుంది. బీజేపీ రాజకీయాలను చూస్తే..  ఆపార్టీ వెనుక తెలుగుదేశం ఉండి నడిపిస్తుందేమో అని అనిపిస్తుంది.

 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎప్పుడూ  దళితుల మీద బాబుకు ప్రేమ లేదు. అధికారం పోయేసరికి, ఈరోజు లేని ప్రేమను ఒలకబోస్తున్నాడు. దళితుల మీద బాబుకు ప్రేమ ఉందని, దళితుల అభివృద్ధి కోసం బాబు ఏనాడైనా ఒక్క మంచి పని అయినా చేశాడని... రాష్ట్రంలో ఏ ఒక్క దళితుడైనా చెప్పే పరిస్థితి లేదు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా.. ? అని మాట్లాడిన చంద్రబాబు ఈరోజు వరకూ పశ్చాత్తాప పడలేదు, దళిత సమాజాన్ని క్షమాపణలు కోరలేదు. 

 చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దళితుల భూములు లాక్కున్నాడు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని మీ చుట్టంలా వాడుకున్నారు. అప్పుడు ఎందుకు దళితులు మీ కంటికి కనిపించలేదు అని అడుగుతున్నాం. ఈరోజు జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో దళితుల సంక్షేమానికి పెద్ద  పీట వేశారు. నవరత్నాలు అయితేనేమీ, మిగతా సంక్షేమ పథకాలు అయితేనేమీ.. ప్రతి పథకం దళితుల గడప వద్దకు వస్తుంటే..  దళితులంతా గుండె మీద చేయి వేసుకుని బతుకున్నారు. దళితులు బాగుంటే చూసి ఓర్వలేని చంద్రబాబు.. ఈరోజు దళితులను అడ్డం పెట్టుకుని మళ్ళీ క్షుద్ర రాజకీయాలు చేయాలని  పన్నాగాలు పన్నుతున్నాడు. చంద్రబాబు ఆటలు సాగవు.

- అధికారంలో ఉన్నప్పుడు దళితులను,  బీసీలను, మైనార్టీలను ఛీత్కరిస్తూ మాట్లాడటం.. అధికారం పోయాక దళితుల భుజం మీద చేయి వేసి,  ఈరోజు దళితులకు అండగా ఉంటాను, పోరాటం చేస్తానని మీ రాజకీయం కోసం వాడుకోవటాన్ని ప్రతి ఒక్క దళిత సోదరుడూ అర్థం చేసుకుంటున్నారు. 

 రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు 31 లక్షల ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే.. కోర్టులకు వెళ్ళి అడ్డుకుంది చంద్రబాబు కాదా...? అమరావతి రాజధానిలో దళితులకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే.. డెమోగ్రాఫిక్ ఇం  బ్యాలెన్స్ వస్తుందని కోర్టులకు ఎక్కి ఆపింది చంద్రబాబు కాదా..? 
- ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం చదువులను అడ్డుకుంది చంద్రబాబు కాదా..?
- అనాదిగా వస్తున్న అసైన్డ్, బీ-ఫారం స్థలాల్లోని ఇళ్ళకు ఓటీఎస్ ద్వారా సంపూర్ణ హక్కులు కల్పిస్తూ, నామమాత్రపు ఫీజుతో, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తుంటే.. దాన్నీ అడ్డుకోవాలని చూస్తున్నది చంద్రబాబు కాదా..?
- డాక్టర్ సుధాకర్ చావుకి కారణం మీరు కాదా.. మీ రాజకీయం కోసం డాక్టర్ సుధాకర్ ను రోడ్డు మీదకు తీసుకు వచ్చి, ఆయన మానసిక స్థితి చెడిపోవటానికి కారణం మీరు కాదా..?

వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చాక.. దళితులు తలెత్తుకుని బతుకుతుంటే.. మీకు ఎందుకు కడుపు మంట...? ఈరోజు కుప్పం పర్యటనలో కూడా ఎన్టీఆర్ దళితులకు సాయం చేశారని చంద్రబాబు చెబుతున్నాడంటే.. చంద్రబాబు ఏనాడూ దళితులకు ఏమీ చేయలేదని అంగీకరించినట్టే కదా.. ?. జగన్ మోహన్ రెడ్డిగారి పరిపాలనలో డీబీటీ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదలందరికీ 30 నెలల కాలంలో ఏకంగా లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేస్తే.. అందులో దళితుల వాటా ప్రకారం.. ప్రతి దళిత కుటుంబానికి దక్కాల్సిన సంక్షేమ ఫలాలు చేరాయి. 

 కుప్పంలో చంద్రబాబు  పార్టీకి చెందిన సైకిల్ చక్రాలు ఊడిపోతే.. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ చక్రాలు ఊడగొట్టేసరికి ఇప్పుడు ఆయనకు దళితులు గుర్తుకొచ్చారు. విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వంలో ఎవరైనా ఆయన విగ్రహాలను అడ్డుకుంటారా.. .?. రాష్ట్రంలో ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహాలను పెట్టించేందుకు ఈ  ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 
- రామకుప్పంలో లేని గొడవను చంద్రబాబు సృష్టిస్తున్నాడు. అక్కడ మీ పార్టీకి చెందిన నలుగురు దళితులను పోగేసి, వారితో రాజకీయం చేయాలని చూస్తున్నావు. దళితుల పక్షపాతిగా, అండగా ఉంటానని బాబు చెబితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. దళితులు ఎవరూ బాబు మాటలు నమ్మరు. 
- దళితుల గురించి మాట్లాడే ముందు... దళితుల్లో ఎవరు పుట్టాలనుకుంటారన్న మాటలకు అంబేడ్కర్ విగ్రహం వద్ద  చంద్రబాబు ముక్కు నేలకు రాయాలి. 

 విగ్రహాలతో రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటు. ఈరోజు ప్రకాశం జిల్లా కొప్పరిపల్లెలో  మహానేత రాజశేఖరరెడ్డి విగ్రహంపై కొందరు దుండగులు పెట్రోలు పోసి, నిప్పు పెట్టారని మీడియాలో చూశాం.  ఇటువంటి నీచ రాజకీయాలు చేసేది చంద్రబాబు అండ్ కో మాత్రమే. అధికారం పోయిందని తట్టుకోలేక.. ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మరోవైపు టీడీపీ నాయకులతో బూతులు తిట్టిస్తున్నాడు. చంద్రబాబు దుష్ట రాజకీయాలు ఈ రాష్ట్రంలో చెల్లవు. 

 దళితుల అభివృద్ధి నిరోధక శక్తిగా చంద్రబాబు తయారయ్యాడు. టీడీపీలో ఉన్న దళితులను కూడా ప్రశ్నిస్తున్నాను. మీరు నిజంగా దళితులైతే.. చంద్రబాబును కొన్ని ప్రశ్నలు అడగండి.
- దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా.. అన్నందుకు చంద్రబాబును నిలదీయాలి
- దళితులపై దాడులు చేసిన అచ్చెన్నాయుడు, బండారు సత్యనారాయణ మూర్తి, తదితరులపై చర్యలు తీసుకోమని నిలదీయండి
- దళితులకు రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన హక్కుల్ని ఎందుకు కాలరాశాడని అడగండి.
- ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఎందుకు మింగేశావని బాబును అడగండి.
- ఈరోజు అంబేడ్కర్ విగ్రహం పెడతానని చెప్పి, ఎందుకు పారిపోయాడో సమాధానం చెప్పాలని అడగండి. 

 రాష్ట్రంలో దళితులకు ఏ కష్టం వచ్చినా.. ఒక అన్నలా ఆదుకుంటూ, భరోసా ఇస్తున్న జగన్ మోహన్ రెడ్డిగారిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంతా ఆదరిస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు. అందుకే, దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నాడు.  ఇప్పటికే కుప్పంలో బాబు సైకిల్ చక్రాలు ఊడిపోయాయి. రాబోయే రోజుల్లో మీ సొంత ఊరు నారావారిపల్లెలో కూడా ప్రజలు ఛీ కొట్టే పరిస్థితి వస్తుంది.  ఇకనైనా దళితులను రాజకీయాలకు వాడుకోవద్దు అని చెబుతున్నాం. 

  చంద్రబాబు దళిత ద్రోహి అన్నది నూటికి నూరు శాతం నిజం. కాబట్టే, ఆయన్ను దళితులు ఎప్పటికీ నమ్మరు. దళితుల సంక్షేమం- అభివృద్ధిపై ఏ ప్రభుత్వంలో ఏం జరిగిందనే దానిపై చంద్రబాబుతో ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధం. మీరు సిద్ధమో, కాదో నిర్ణయించుకోండి.
 

Back to Top