గ‌త ఐదేళ్ల‌ల్లో సాగునీటి ప్రాజెక్టుల‌పై టీడీపీ నిర్ల‌క్ష్యం 

నీరు-చెట్టు ప‌థ‌కంలో అక్ర‌మాలు జ‌రిగాయి

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మానుగుంట మ‌హీధ‌ర్‌రెడ్డి

అమరావతిః గత ఐదేళ్లలో ప్రాజెక్టులకు ఎటువంటి మరమ్మతులు చేయకుండా టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని  వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు.గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మైనర్,మీడియం ఇరిగేషన్‌లు అన్యాక్రాంతమవుతున్నాయని తెలిపారు. చెరువులన్ని ఆక్రమణలకు గురివుతున్నాయని తెలిపారు. చెరువుల్లో నీళ్లు లేవని..కంప చెట్లతో నిండిపోయాయన్నారు.మధ్య,చిన్న తరహా చెరువులపై దృష్టి సారించాలని కోరారు.  కందుకూరు నియోజకవర్గ సమస్యలను ఆయన ప్రస్తావించారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలించారన్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు మరమ్మత్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. నీరు–చెట్టు పథకంలో అక్రమాలు జరిగాయన్నారు.

తాజా ఫోటోలు

Back to Top