సంక్రాంతి కొత్త భిక్షగాడు చంద్రబాబు

మంత్రి కొడాలి నాని
 

విజయవాడ: సంక్రాంతికి కొత్త భిక్షగాడిలా చంద్రబాబు జోలెపట్టి అడుక్కునే అవతారం ఎత్తారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. హైపవర్‌ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 
ఈ రోజు హైపవర్‌ కమిటీలో జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ కమిటీ నివేదికలు, గతంలో నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలపై చర్చించాం. వందేళ్లలో తమిళనాడు నుంచి ఎలా విడిపోయాం..రాజధానుల విషయం, రాష్ట్ర విభజన తదితర అంశాలపై చర్చించాం. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి కాదు..రాష్ట్రానికి బోలెడు చరిత్ర ఉంది.అన్నింటిని దృష్టిలో పెట్టుకొని, ప్రాంతాల మధ్య వ్యత్యాలు ఉండకూడదు. ఏ రకంగా పరిపాలించాలి. అభివృద్ధి, పరిపాలనలో సమతూల్యత పాటించాలని చర్చించాం.చంద్రబాబును మించిన స్వార్థపరుడు రాష్ట్రంలో ఎవరు లేరు. ఓటుకు కోట్లు కేసులో హైదరాబాద్‌లో దొరికిన చంద్రబాబు..అర్ధరాత్రి అమరావతికి పారిపోయి వచ్చారు. ఆయన పౌరుషం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు చవట, దద్దమ్మ, సన్యాసి, ఆయన పౌరుషాల గురించి మాట్లాడుతారా?. గతం నుంచి చూస్తున్నాం..సంక్రాంతి పండుగకు హరిదాసులు వచ్చేవారు. గంగిరెద్దులు వచ్చేవి. వాళ్లకు ధాన్యం, డబ్బులు ఇచ్చేవారు. ఈ రోజు కొత్తగా సంక్రాంతి పండుగకు జోలె పట్టుకొని ఓ ముస్టోడు అంటే చంద్రబాబు సంక్రాంతి పండుగకు జోలె పట్టుకొని కొత్త క్యారెక్టర్‌తో వచ్చాడు. ఆయన కుమారుడు లోకేష్‌, టీడీపీ నేతలు ఇంటింటికి తిరిగి ముస్టి అడుక్కునే క్యారెక్టర్లను చంద్రబాబు అంకురార్పణ చేశారు. దేవుడు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ద్వారా చంద్రబాబును శిక్షించాడు. అదే సంక్రాంతి కొత్త భిక్షగాడు, హరిదాసు, గంగిరెద్దు మాదిరిగా చంద్రబాబు కూడా పగటి వేషగాడిలా జోలె పట్టి అడుక్కునే అవతారం ఎత్తాడు.  

 

Back to Top