బీసీల ఆరాధ్య దైవం వైయ‌స్ఆర్‌..ఆత్మ బంధువు వైయ‌స్ జ‌గ‌న్‌

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌

పేద‌ల సొంతింటి క‌ల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నిజం చేశారు

చారిత్మాత్ర‌క కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌లంతా హ‌ర్షిస్తున్నారు

ప్ర‌జ‌లు సంతోషంగా ఉంటే చంద్ర‌బాబు ఓర్వ‌లేక‌పోతున్నారు

ఎల్లోమీడియాతో క‌లిసి ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు బుర‌ద జ‌ల్లుతున్నారు

తాడేప‌ల్లి:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి బీసీల ఆరాధ్య ధైవ‌మైతే..ఆయ‌న కుమారుడు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆత్మ‌బంధువుగా మారార‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే జోగి ర‌మేష్ కొనియాడారు. ప్ర‌జ‌లంతా సంతోషంగా ఉంటే చంద్ర‌బాబు ఓర్వ‌లేక‌పోతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు బుర‌ద జ‌ల్లుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలోని కోటి 31 ల‌క్ష‌ల మందికి సొంతింటి క‌ల‌ను నిజం చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల గుండెల్లో క‌ల‌కాలం నిలిచిపోతార‌న్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో జోగి ర‌మేష్ గురువారం మీడియాతో మాట్లాడారు.

ఎన్నిక‌ల మేనిఫెస్టోలో, పాద‌యాత్ర‌లో పేద ప్ర‌జ‌ల‌కు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల‌కు ఇచ్చిన హామీ మేర‌కు ఇవాళ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌క్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టార‌ని తెలిపారు. పేద‌ల సొంతింటి క‌ల‌ను సాకారం చేస్తున్న ఘ‌న‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌న్నారు. చారిత్రాత్మ‌క కార్య‌క్ర‌మాన్ని ప్ర‌జ‌లంతా హ‌ర్షిస్తున్నార‌ని జోగిర‌మేష్ తెలిపారు. 

ప్ర‌జ‌లు సంతోషంగా ఉంటే చంద్ర‌బాబు ఓర్వ‌లేక‌పోతున్నార‌ని ఎమ్మెల్యే జోగి ర‌మేష్ ధ్వ‌జ‌మెత్తారు.సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో కూర్చొని జూమ్ యాప్‌, వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కుట్ర‌లు చేస్తూ..రెచ్చ‌గొడుతూ బుర‌ద జ‌ల్లుతున్నార‌ని ఫైర్ అయ్యారు. తెలుగు డ్రామా పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు అని ఎద్దేవా చేశారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన ఆ పార్టీ మ‌హానాడులో టీడీపీ నేత‌ల కుట్ర‌లు లీక్ కావ‌డంతో వారి బంఢారం బ‌ట్ట‌బ‌య‌లైంద‌న్నారు. రాష్ట్రంలో కోటి 21 ల‌క్ష‌ల మందికి ఇంటిస్థ‌లంతో పాటు ఇల్లు క‌ట్టిస్తుంటే టీడీపీ నేత‌లు ఓర్వ‌లేక‌పోతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

చంద్ర‌బాబు ఎల్లో మీడియాతో క‌లిసి ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్లుతున్నార‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు వెంట ఏ వ‌ర్గం లేద‌ని, ఏ కులం లేద‌ని తేల్చి చెప్పారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభిన‌వ అంబేద్క‌ర్‌, ఫూలే అని కొనియాడారు. వారి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా మ‌రో నాలుగు అడుగులు ముందుకు  వేస్తూ వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న సాగిస్తున్నార‌ని చెప్పారు. ఇందుకు రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌లే మంచి ఉదాహ‌ర‌ణ అన్నారు. మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీని ప్ర‌జ‌లు భారీ మెజారిటీతో గెలిపించార‌ని గుర్తు చేశారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌కు ఏపీ ప్ర‌జ‌లంతా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలిపారు. వైయ‌స్ జ‌గ‌న్‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు జేజేలు ప‌లుకుతున్నార‌ని, ఆ విష‌యం మున్సిప‌ల్‌, పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వెల్ల‌డైంద‌ని ఎమ్మెల్యే జోగి ర‌మేష్ పేర్కొన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top