రాజధాని పేరుతో చంద్రబాబు అంతర్జాతీయ స్థాయి స్కాం

చంద్రబాబు  ప్రభుత్వ నిర్వాకం వల్లే రుణం రాలేదు 

వైయస్‌ఆర్‌సీపీపై  దుష్ఫ్రచారం చేయడం మానుకోవాలి

చంద్రబాబు,లోకేష్‌కు సీఎం వైయస్‌ జగన్‌ను విమర్శించే అర్హత లేదు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌

అమరావతిః  ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పి అమరావతి పేరుతో చంద్రబాబు అంతర్జాతీయ స్థాయిలో భారీ స్కాం చేశారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ధ్వజమెత్తారు.విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  రాజధాని ప్రాంతానికి మొదట నూజీవీడు ప్రాంతం అనువైనదిగా  చెప్పి చంద్రబాబు తన పచ్చపత్రికల ద్వారా ప్రచారం చేయించి..కొంతమంది బలిచేశారన్నారు. మళ్లీ అమరావతిని రాజధానిగా ఎంచుకోవడంలో చంద్రబాబు ఉద్ధేశ్యం ఆ రోజే వైయస్‌ఆర్‌సీపీ బయటపెట్టిందన్నారు. రాజధానికి రైతులు మాతో కలిసి వచ్చారని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారులు, మంత్రులను రైతుల  ఇళ్లకు పంపించి భయభ్రాంతులకు గురిచేశారన్నారు.

33వేల ఎకరాలు సేకరించారని..దీని ద్వారా  రాజధాని ప్రాంతానికి  ఏవిధంగా లబ్ధి చేకూర్చారో సమాధానం చెప్పాలన్నారు.  అమరావతి ఒక భ్రాంతి అనే చందాన..అమరాతిని ఒక భ్రమరావతిగా చూపించారన్నారు.సాంతికేక పరిజ్ఞానంతో బాహుబలి సెట్టింగ్‌లు,ఎల్లో మీడియా ప్రచార అర్భాటాలు తప్ప ఏమీ లేదన్నారు. రాజధానికి వెళ్లడానికి రహదారి సౌకర్యం కూడా కల్పించలేదని ఇది చంద్రబాబు అసమర్థ పరిపాలనకు నిదర్శనమన్నారు.  వైయస్‌ఆర్‌సీపీ వల్లనే ప్రపంచ బ్యాంకు రుణం వెనుక్కువెళ్ళిందని టీడీపీ  ప్రచారం చేస్తోందని తప్పుబట్టారు. అసలు ప్రపంచబ్యాంకు ఎప్పుడు రుణం ఇస్తామని చెప్పిందో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ప్రపంచబ్యాంకు నుంచి జూన్‌ 12న‌  ఒక లేఖ రాసింద‌ని ..ఎక్కడ కూడా  కూడా ఏపీ రాజధానికి ప్రపంచ బ్యాంకు నిధులు ఇస్తామనే దాఖలాలు లేవన్నారు.

ప్రపంచ బ్యాంకు ఏం చెప్పిందంటే..అన్నివర్గాలు కూడా వ్యతిరేకంగా ఉన్నారని, సామాజిక న్యాయం పాటించలేదని..మూడు,నాలుగు పంటలు పండే మంచి వ్యవసాయ భూమిని ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి లాక్కుందని వాస్తవాన్ని తెలిపిందన్నారు. రాజధాని రైతులు మీతో కలిసివచ్చారా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ప్రపంచ బ్యాంకు లేఖ రాసేటప్పటికీ  వైయస్‌ఆర్‌సీపీ అధికారం చేపట్టి కేవలం 12 రోజులు మాత్రమే అయ్యిందన్నారు.బిహార్‌ పక్కా ప్రణాళికతో దూసుకుపోతేంటే ఏపీలో మాత్రం ఆయోమయ పరిస్థితి ఉందని మకీ సంస్థ రిపోర్టు ఇచ్చిందన్నారు.

గత ఐదేళ్లలో ఘోరంగా ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేశారన్నారు. ఏపీలో చంద్రబాబు  తుగ్లక్‌ పాలన చేశారన్నారు. తగ్లక్‌ పరిపాలన అంటే గుర్తుకు వచ్చేంది..చంద్రబాబు పరిపాలనేనని ఎద్దేవా చేశారు. రాజధానిలో చంద్రబాబు ఎందుకు సొంత ఇంటిని కట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు  ప్రభుత్వ నిర్వాకం వల్లే రుణం రాలేదన్నారు.  రాజధానిలో బాబు సర్కార్‌ అడుగడుగునా ఉల్లంఘనలు జరిగాయన్నారు. వైయస్‌ఆర్‌సీపీపై  దుష్ఫ్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు,లోకేష్‌కు సీఎం వైయస్‌ జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు.

 

Back to Top