టీడీపీ పాలనలో లోకేష్‌కు మాత్రమే ఉద్యోగం వచ్చింది

ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
 

అమరావతి: ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపించారని, వర్ధంతికి, జయంతికి తేడా తెలియని నారా లోకేష్‌కు మాత్రమే ఉద్యోగం వచ్చిందని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత తరఫున ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాల బిల్లుపై జరిగిన చర్చలో రాజా మాట్లాడారు. రాష్ట్రంలో ఏ పరిశ్రమలో చూసినా, కంపెనీలో చూసినా నో వేకెన్సీ బోర్డులు కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని చట్టం చేసి కూడా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణలో అడ్డగోలుగా దొరికిపోయిన చంద్రబాబు కేంద్రం వద్ద మన హక్కులను తాకట్టు పెట్టారని విమర్శించారు. ప్రత్యేక హోదా వచ్చి ఉండి ఉంటే రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు పరుగులు తీసేవారని చెప్పారు. 2014 నుంచి వైయస్‌ జగన్‌ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేశారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు యూటర్న్‌లు తీసుకున్నారన్నారు. 
 

Back to Top