చంద్రబాబు విజన్‌ 2020 అంటే..20 మంది ఎమ్మెల్యేలు మిగిలారు

అమరావతిలో పవన్‌ పర్యటన విడ్డూరంగా ఉంది

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖ: చంద్రబాబు విజన్‌ 2020 అంటుంటే ఏంటో అనుకున్నాం కానీ..2020 వచ్చే నాటికి ఆయనకు 20 మంది ఎమ్మెల్యేలు మిగులుతారని ఇప్పుడు అర్థమైందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు.  విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్‌ కళ్యాణ్‌ అమరావతిలో పర్యటించడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్‌ ఒక రోజు ఫ్రీ పెయిడ్‌..మరో రోజు పోస్టు పెయిడ్‌ ఆర్టీస్టులా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. పట్టుమని 20 సినిమాలు చేయలేదు..నిండా 60 ఏళ్లు లేవు..పవన్‌ రాజకీయాల్లో ఎందుకు నటిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సినిమాల్లో కంటే రాజకీయాల్లో నటిస్తే ఎక్కువ డబ్బు వస్తుందని పవన్‌ రాజకీయాల్లోకి వచ్చినట్లు కనిపిస్తుందన్నారు. 
ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖలో కార్యనిర్వాహక రాజధాని చేస్తామని సీఎం ప్రకటించడంతో ఈ ప్రాంత ప్రజలు ఆనందంగా ఉన్నారు. చంద్రబాబు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు. నూతన సంవత్సర వేడుకలకు చంద్రబాబు ఎందుకు దూరంగా ఉంటున్నారు. ఒక్క అమరావతి ఉంటే సరిపోతుందా? 13 జిల్లాల అభివృద్ధి ఆయనకు నచ్చదా? రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం ఉంటే..ఆయన మాత్రం రియల్‌ ఎస్టేట్‌పై ఆధారపడ్డారు. ఆయన రాజకీయ పార్టీని నడిపే నైతిక విలువలు కోల్పోయారు. రాష్ట్ర ప్రజలు ఇటీవల ఎన్నికల్లో చంద్రబాబుకు సరైన తీర్పు ఇచ్చినా కూడా బుద్ది రాలేదు. చంద్రబాబు విజన్‌ 2020 అంటుంటే నాకు అర్థం కాలేదు. 2020 వచ్చే సరికి చంద్రబాబుకు 20 మంది ఎమ్మెల్యేలు మిగులుతారన్నది అర్థం కాలేదు. 20 ఏళ్ల క్రితం ఊహించి చెబితే..ఇప్పుడు 20 మంది ఎమ్మెల్యేలు మిగిలాయి. ఆయన విజన్‌ చాలా గొప్పది. వచ్చే ఏడాది ఎంతమంది ఉంటారో వేచి చూడాలి. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు..

తాజా వీడియోలు

Back to Top