సీఎం వైయ‌స్‌ జగన్‌ పాలనతో పేదరికం తగ్గింది

ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి

అమ‌రావ‌తి:   ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌తో రాష్ట్రంలో పేద‌రికం త‌గ్గింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి తెలిపారు.  సీఎం వైయ‌స్ జగన్‌ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగింద‌ని చెప్పారు. అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై ధ‌న్య‌వాద తీర్మానంపై జ‌రిగిన చ‌ర్చ‌లో ఎమ్మెల్యే శ్రీ‌కాంత్‌రెడ్డి మాట్లాడారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చార‌ని తెలిపారు. రూ.2 లక్షల 53 వేల కోట్లు పేదల ఖాతాలో వేశార‌న్నారు. మీకు మంచి జరిగితేనే నాకు అండగా నిలబడండి అని సీఎం వైయ‌స్ జగన్‌ చెప్పార‌ని, ఇలా చెప్పే ద‌మ్ము చంద్ర‌బాబుకు ఉందా అని ప్ర‌శ్నించారు. నాయకత్వం అంటే సీఎం వైయ‌స్‌ జగన్‌ది, నాయకుడికి ఉండాల్సిన లక్షణం చంద్రబాబుకి లేద‌న్నారు. ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందాలో ప్రతిపక్షం ఆలోచిస్తోంద‌ని శ్రీ‌కాంత్‌రెడ్డి విమ‌ర్శించారు.

తాజా వీడియోలు

Back to Top