ఏటా వైయస్‌ఆర్‌ వన మహోత్సవం కార్యక్రమం

ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి
 

అమరావతి: ప్రతి ఏటా రాష్ట్రంలో వైయస్‌ఆర్‌ వన మహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కోరారు. సోమవారం సభలో ఆయన మాట్లాడుతూ..పర్యావరణం దెబ్బతినడంతో అనంతపురం జిల్లాలో సకాలంలో వర్షాలు లేక కరువుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో రాజన్న వన మహోత్సవాన్ని నిర్వహించాలని, ఏడాదికి లక్ష మొక్కలు నాటాలని కోరారు. గత ప్రభుత్వం హంద్రీనీవా–సుజల స్రవంతి పథకాన్ని వైయస్‌ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చారు. చంద్రబాబు బుక్కపట్నం రిజర్వాయర్‌ ప్రారంభించేందుకు వచ్చిన సమయంలో టీడీపీ నేతలు కొండకు పచ్చ రంగు పూశారన్నారు. పర్యావరణాన్ని దెబ్బతీశారని విమర్శించారు. కరువు నివారణకు చర్యలు తీసుకోవాలని శ్రీధర్‌ రెడ్డి కోరారు. 

 

తాజా ఫోటోలు

Back to Top