విజయనగరం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేదల పక్షంలో ఉంటే, ప్రతిపక్ష నేత చంద్రబాబు పెత్తందార్లకే మద్దతు ఇస్తున్నారని ఎమ్మెల్యే బడుకొండ అప్పల నాయుడు విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం నెల్లిమర్ల మండలం మొయిద విజయరాం పురం గ్రామ సచివాలయం పరిధిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల గౌరవ శాసన సభ్యులు బడుకొండ అప్పల నాయుడు, శాసన మండలి సభ్యులు డాక్టర్ పి వి వి సూర్య నారాయణ రాజు (పెనుమత్స సురేష్ బాబు) పాల్గొని సచివాలయం పరిధిలో వివిధ సంక్షేమ పథకాల రూపంలో జగనన్న ప్రభుత్వం అందజేసిన సంక్షేమ ఫలాల లబ్ధి వివరాల బోర్డును ఆవిష్కరించి, అనంతరం వైయస్ఆర్‌సీపీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో నెల్లిమర్ల మండల పరిషత్ అధ్యక్షురాలు అంబళ్ళ సుధారాణి, జెడ్.పి.టి.సి. గదల సన్యాసి నాయుడు, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు సలహా మండలి సభ్యులు అంబళ్ళ శ్రీరాములు నాయుడు, వైస్ ఎంపీపీ సారిక వైకుంఠం, సీనియర్ నాయకులు గిరిబాబు, మొయిద ఎం.పి.టి.సి. పెనుమత్స సంతోష్ బాబు, సచివాలయం పరిధిలో గల రెండు గ్రామాల సర్పంచులు, వాలంటీర్లు, గృహ సారథులు, అధికారులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.