శాసనమండలిని ఇష్టానికి వాడుకుంటున్నారు

పేదలు ఇంగ్లిష్‌ మీడియంలో చదవుకోకూడదా.. చంద్రబాబూ?

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

అసెంబ్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధన గొప్ప కార్యక్రమం అని, దీన్ని ఆడ్డుకోవాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు గౌరవ న్యాయస్థానాలు తప్పుదోవ పట్టిస్తున్నాడని, శాసనసభను, మండలిని ఇష్టం వచ్చినట్లుగా వాడుకుంటున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు విధానాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. ‘ఇంగ్లిష్‌ మీడియం బోధన వంటి చరిత్రాత్మక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం చాలా సంతోషకరం. ఒకటి నుంచి 6వ తేదీ వరకు ఇంగ్లిష్‌ మీడియం బోధించాలని, ఏటా తరగతి పెంచుకుంటూ పోవాలని బిల్లు ఉద్దేశం. బిల్లును అసెంబ్లీ ఆమోదించి మండలి సూచనలు, సలహాలకు పంపించడం జరిగింది. శాసనమండలి బిల్లుపై నాలుగు సవరణలు చేస్తే తిరిగి సభకు పంపించింది. ఆ నాలుగు సవరణల్లో కూడా ప్రధానంగా ఇంగ్లిష్‌ మీడియంను తీసివేయాలని, తెలుగు మీడియం, ఇంగ్లిష్‌ మీడియం తీసుకోవాలనే నిర్ణయాన్ని తల్లిదండ్రులు, పిల్లలకు వదిలివేయాలని మండలి సూచన చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఏదైతే బిల్లును ప్రవేశపెట్టిన తరువాత టీడీపీ నిర్ణయాన్ని చెప్పిన తరువాత వీగిపోయారో.. మీడియా ముందు ఏౖదైతే మాట్లాడారో అదే సూచనలు, సలహాలను మండలి చెప్పింది. ఇది చాలా బాధాకరం.

విద్యా ప్రాథమిక హక్కు. ప్రతి పిల్లవాడికి విద్యను ఉచితంగా అందించాలి. నారాయణ, శ్రీచైతన్య లాంటి ప్రైవేట్‌ విద్యాలయాలు వాటిల్లో ఎక్కడా కూడా తెలుగు మీడియంలో విద్యాబోధన జరగడం లేదు. తన బినామీలు చేసేదాన్ని బయట సమర్థిస్తున్నాడు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఉన్నత కులాల్లోని పేదలు ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. అలాంటి దాన్ని గమనించుకోకుండా  బలం ఉందని మండలి ద్వారా సూచనలు, సలహాలు పంపించడం అంటే దుర్బుద్ధితో పేదలు ఎవరూ ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకోకూడదనే దురాలోచనతో ఇలాంటి విధానాలు చేస్తున్నాడని స్పష్టంగా అర్థం అవుతుంది. డిసెంబర్‌ 16వ తేదీన బిల్లును పాస్‌ చేసి మండలికి పంపించడం.. మండలి సూచనలు, సలహాలపై సభ చర్చించడం జరుగుతుంది. బిల్లు తయారై బయటకు వచ్చేసరికి కొంతసమయం పడుతుందని, త్వరగా అడ్డుకోవాలని చంద్రబాబు కుట్రలు పన్నుతూ.. గవర్నమెంట్‌ ఆర్డర్‌పై చంద్రబాబు న్యాయస్థానాలకు వెళ్లాడు.

 

తాజా వీడియోలు

Back to Top