చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి 

చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
 

విశాఖ: వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మను విశాఖవాసులు దహనం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు ద్రోహం చేశారంటూ నినాదాలు చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే అదిప్‌రాజ్‌ మాట్లాడుతూ..చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని విమర్శించారు. చంద్రబాబువి స్ట్రీట్‌ పాలిటిక్స్‌ అయితే, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసేది స్ట్రెయిట్‌ పాలిటిక్స్‌ అని చెప్పారు.  చంద్రబాబు సాగిస్తున్న కుట్రలు, కుతంత్రాలు, దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని  పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం వైఎస్‌ జగన్‌ పడుతున్న కష్టాన్ని, చేపడుతున్న పథకాలను, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

తాజా వీడియోలు

Back to Top