సంక్షేమ పాలనను పక్కదోవ పట్టించేందుకే కేసులు

రఘురామకృష్ణంరాజు కేసులో విషయం లేదు

చివరకు న్యాయమే గెలిచింది 

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి  సజ్జల రామ‌కృష్ణారెడ్డి

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలనను పక్కదోవ పట్టించేందుకే రఘురామకృష్ణంరాజు కేసులు వేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఇలాంటి దురుద్దేశపూరితమైన కేసులను కోర్టులు కూడా స్వీకరించకూడదని అన్నారు. సుప్రీంకోర్డు కూడా పిల్‌లు దుర్వినియోగం కాకుండా చూడాలని సూచించిందని గుర్తుచేశారు. 

ఈ కేసును అడ్డు పెట్టుకుని వాళ్లు చేసిన విషప్రచారం అంతాఇంతా కాదని పేర్కొన్నారు. ఎల్లో మీడియా అసంబద్ధమైన చర్చలు పెట్టిందని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వారి పైత్యం పతాక స్థాయికి చేరింది.. చివరకు న్యాయమే గెలిచింది’ అని ఆయన బుధవారం నాటి మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ఇలాంటి దుష్ప్రచారాలపై కోర్టులు కూడా దృష్టి సారించాలని సజ్జల విజ్ఞప్తి చేశారు. దురుద్దేశపూరితమైన ప్రచారాలను సూమోటోగా తీసుకోవాలని కోరారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top