వైయ‌స్ఆర్‌ ఆస‌రాతో..మ‌గువ‌ల జీవితాల‌లో వెలుగులు 

మంత్రులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

వేడుక‌లా వైయ‌స్ఆర్ ఆస‌రా కార్య‌క్ర‌మాలు

ఉత్త‌రాంధ్ర‌:  వైయ‌స్ఆర్‌ ఆస‌రాతో..మ‌గువ‌ల జీవితాల‌లో వెలుగులు నిండాయ‌ని మంత్రులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ఇవాళ ప‌లు చోట్ల వైయ‌స్ఆర్‌ ఆస‌రా నాలుగో విడ‌త కార్య‌క్ర‌మంలో భాగంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌ల‌కు మంత్రులు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. శ్రీ‌కాకుళం నగర పాలక సంస్థ పరిధిలోని బలగ ప్రధాన మంచినీటి సరఫరా కేంద్రం వద్ద  రూ.4 కోట్లతో నిర్మించిన 5 ఎంఎల్డి ఇన్ ఫిల్ట్రేషన్ గ్యాలరీ,కలెక్షన్ వెల్,పంప్ హౌస్,వాటర్ వర్క్స్ అభివృద్ధి పనులు రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. అనంతరం నగర పాలక సంస్థ ప‌రిధిలో బ‌ల‌గ వ‌ద్ద ఏర్పాటు చేసిన స‌భ‌లో, అలానే గార ఎంపీడీఓ కార్యాల‌యం ప్రాంగ‌ణాన ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి మాట్లాడారు. ఈ రెండు చోట్లా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి మంత్రి ధ‌ర్మాన ముఖ్య అతిథిగా విచ్చేశారు.  చీపురుపల్లి నియోజకవర్గంలో వై.యస్.ఆర్ ఆసరా 4 విడత చెక్కులను మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ  పంపిణీ చేశారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రులు మాట్లాడుతూ..సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన మాట త‌ప్ప‌కుండా మ‌గువ‌ల జీవితాల్లో భ‌రోసా నింపిన ఏకైక ప్ర‌భుత్వం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ నేతృత్వాన న‌డుస్తున్న ప్ర‌భుత్వం అని పున‌రుద్ఘాటించారు. గెలిచినప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక వేరొక మాట చెప్పే ప్రభుత్వం ఇది కాదు. ఎన్నికల ముందు ఏం చెప్పామో అది తు.చ.తప్పకుండా చేసిన ఘనత మాది. పాదయాత్ర లో మహిళా సంఘాలు వారు కష్టాలు వైఎస్ జగన్ కి వివరించారు. అప్పటికే మానిఫెస్టో విడుదల అయ్యింది అని, కనుక నాలుగు దఫాల‌లో మీ రుణాలు చెల్లిస్తాం అని జగన్ చెప్పారు. అన్నవిధంగానే నాలుగో దఫా వేశాం. ఆ ఆనందం మీతో పంచుకునేందుకు, సంక్షేమ ప‌థ‌కాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం వివ‌రించేందుకు ఏర్పాటు చేసిన సభలో పాల్గొనడం ఆనందంగా ఉంది. స్వతంత్రం వచ్చి 75ఏళ్లు అవుతోంది. కానీ వాటి ఫలితాలు పొందని వారు నిరాశ, నిస్పృహలో ఎంతో మంది ఉండిపోయారు. అలాంటి వర్గాలను గుర్తించి ఇల్లు, విద్య, వైద్యం వంటి సదుపాయాలు ప్రభుత్వమే కల్పించింది. శ్రీకాకుళం పట్టణంలో 500 కోట్ల రూపాయ‌లు వెచ్చించి 20 వేల మందికి ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశాం. ప్రభుత్వం అందించిన తోడ్పాటు వల్లనే ఈరోజు ప్రతి కుటుంబం సంతోషంగా ఉంది. ఇంతకు ముందు మహిళా సంఘాలకు, రైతులకు చెప్పిన హామీలు చంద్రబాబు నెరవేర్చారా..? లేదు.మరి ఈ రోజు మళ్ళీ దొంగ హామీలతో మీ ముందుకు వస్తున్నారు. వారిని న‌మ్మ‌కండి. మేలు చేసే ప్ర‌భుత్వానికి మ‌రోసారి మ‌ద్ద‌తుగా నిల‌వండి అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.


ఆయా కార్య‌క్ర‌మాల్లో విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను), విజయనగరం జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఉపాధ్యక్షులు బెల్లాన వంశీకృష్ణ , వలిరెడ్డి శిరీష ఎంపీపీ  ఇప్పిలి వెంకట నర్సమ్మ‌, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, పిడి డిఆర్డిఏ విద్యాసాగర్, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణ,  జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మార్పు ధర్మ రావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top