ఏమి "టీ" సంగ‌తులు..!

గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైన మంత్రి విడ‌ద‌ల ర‌జిని
 

ప‌ల్నాడు: గ‌డ‌ప గ‌డ‌పకు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని అవిశ్రాంతంగా నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల యోగ‌క్షేమాలు తెలుసుకుంటూ ప‌ర్య‌టిస్తున్నారు.  ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌తో మంత్రి మ‌మేక‌మ‌వుతూ..వారి క‌ష్ట న‌ష్టాలు తెలుసుకుంటున్నారు. తాజాగా మంత్రి ఇంటింటా ప‌ర్య‌టిస్తూ.. హ‌ఠాత్తుగా ఒక టీ స్టాల్ వ‌ద్ద ఆగారు. కార్య‌క‌ర్త‌లంద‌రితో పాటు అదే టీస్టాల్‌లో కాస్తంతా టీ తాగుతూ సేదతీరారు. ప్ర‌జ‌ల యోగ‌క్షేమాలు తెలుసుకుంటూ, నియోజ‌క‌వ‌ర్గ ప‌రిస్థితుల‌ను చ‌ర్చిస్తూ గ‌డిపారు. త‌న టీ స్టాల్‌కు సాక్షాత్తూ మంత్రిగారే వ‌చ్చి టీ తాగారు అంటూ... వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అభిమాని, టీ స్టాల్ య‌జ‌మాని కొండెబోయిన విశ్వ‌నాథం చాలా సంతోషించారు. ఇలాంటి నేత‌లు ఉన్నంత కాలం ప్ర‌జ‌లకు ఎలాంట‌టి ఢోకా ఉండ‌దు మ‌రి.

Back to Top