విశాఖ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ సామ్రాజ్యాన్ని సృష్టించారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి విడదల రజని అన్నారు. గ్రామ స్థాయి వాలంటీర్ వ్యవస్థ నుంచి మంత్రివర్గ కూర్పు వరకు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు, ఏ విధంగా సామాజిక న్యాయం పాటించారో వివరించేందుకే ఈ సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర. తన కేబినెట్ లో ఈ వర్గాలకు చెందిన 17మందికి, అంటే 70శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇస్తే, అందులో పదిమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన నాయకుడు జగన్ గారే. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కూడా గొప్పగా అమలు అవుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రజలందరికీ తెలియచేసి, వారిని మరింత చైతన్యవంతుల్ని చేయడానికే ఈ బస్సుయాత్ర చేపడుతున్నాం. జగనన్న అమలు చేస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం అక్కచెల్లెమ్మల పేరుతోనే ప్రారంభించడం జరిగింది. గతంలో ఎన్నడూ, ఎప్పుడూ, ఏ నాయకుడు చేయని మంచిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మా జగనన్న చేశాడని మీ అందరికీ చెప్పేందుకే మీ ముందుకు వచ్చాం. మిగతా అన్ని రాజకీయ పార్టీలకు సామాజిక న్యాయం అన్నది కేవలం నినాదాలకే పరిమితమైతే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సామాజిక న్యాయాన్ని తమ విధానంగా మార్చుకుంది. రాష్ట్రంలో ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద వర్గాలు ఆనందంగా, ఉన్నారంటే దానికి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి సుపరిపాలనే. సామాజిక న్యాయానికి అడుగులు వేస్తూ ఈ మూడేళ్లలో సంక్షేమ సామ్రాజ్యాన్ని వైయస్ జగన్ గారు స్థాపించారని విడుదల రజిని తెలిపారు.