రుయా ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించాం

బాధ్యులెవ‌రైనా వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేదు

తిరుప‌తి రుయా ఆస్ప‌త్రి అంబులెన్స్ ఘ‌ట‌న‌పై స్పందించిన మంత్రి విడ‌ద‌ల ర‌జిని

గుంటూరు: తిరుపతి రుయా ఆస్ప‌త్రిలో అంబులెన్స్‌ ఘటనపై వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని స్పందించారు. ఆస్ప‌త్రి అధికారులను వివరణ కోరామని, విచారణకు ఆదేశించామని స్ప‌ష్టం చేశారు. ఈ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రమని, ఇలాంటి వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మృతుడి కుటుంబ స‌భ్యుల‌ను ప్రైవేటు వ్య‌క్తులు బెదిరించారా..? ఆస్ప‌త్రి సిబ్బందే బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారా..? అనే కోణంలో విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించామని మంత్రి విడ‌ద‌ల ర‌జిని చెప్పారు. మ‌హాప్ర‌స్థానం అంబులెన్స్‌లు  24 గంట‌లూ ప‌నిచేసేలా త్వ‌ర‌లోనే ఒక విధానాన్ని తీసుకొస్తామన్నారు. ప్రీపెయిడ్ ట్యాక్సుల విష‌యాన్ని ప‌రిశీలిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్ప‌త్రుల్లో మృత‌దేహాల‌ను వీలైనంత‌ వ‌ర‌కు మ‌హాప్ర‌స్థానం వాహ‌నాల ద్వారానే ఉచితంగా త‌ర‌లించేలా చ‌ర్య‌లు తీసుకుంటామని చెప్పారు.  అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో మృతుల కుటుంబ స‌భ్యులే నిర్ణ‌యం తీసుకునేలా చూస్తామన్నారు. అన్ని ఆస్ప‌త్రుల్లో ప్రైవేటు అంబులెన్సుల‌ను నియంత్రిస్తామని మంత్రి విడదల రజిని చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top