ఆల‌యాల్లో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు

మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస్‌

విజయవాడ: ఆల‌యాల్లో అవినీతికి పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ హెచ్చ‌రించారు.  ఆలయాలలో జరుగుతున్న అవినీతిపై గతంలోనూ విచారణ జరిపామని ఆయ‌న‌ తెలిపారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. నాడు శ్రీశైలం, ద్వారకా తిరుమలలో చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. దుర్గగుడిలో  ఏసీబీ‌ దాడులకు సంబంధించి తనపై పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.  రాష్ట్ర ప్రభుత్వంలో ఏసీబీ దాడులు అనేవి ఒక భాగమన్నారు. ఎవరు అవినీతికి పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ నియోజకవర్గంలో నడవలేనివారు, డిపాజిట్‌లు రానివారు ఉన్నారని...ఈ ఎన్నికల ద్వారా వారిని ప్రజలే తరిమి కొడతారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top