నిద్రలేచి నిజాలు తెలుసుకొని మాట్లాడు పవన్‌

పురోహితులపై పవన్‌ కల్యాణ్‌ది కపట ప్రేమ

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ: పురోహితులపై పవన్‌ కల్యాణ్‌ కపట ప్రేమ చూపిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. పురోహితులకు సాయం ప్రకటించాక డిమాండ్‌ ఏంటీ పవన్‌ అంటూ ఎద్దేవా చేశారు. విజయవాడలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. పార్ట్‌ టైం రాజకీయాలు చేసే ప్యాకేజీ పవన్‌ కల్యాణ్‌ నిద్రలేచిన తర్వాత నిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. విజయవాడ వస్తే.. వపన్‌కు వాస్తవాలు తెలుస్తాయన్నారు. బ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉందని, సంక్షేమ పథకాలపై సీఎం వైయస్‌ జగన్‌ క్యాలెండర్‌ విడుదల చేశారని గుర్తుచేశారు. ఈ నెల 26న అర్చకులకు రూ.5 వేల చొప్పున సాయం అందించనున్నామన్నారు. 
 

Back to Top