లోకేష్‌..ప‌వ‌న్‌ల‌పై చ‌ర్య‌లు తీ సుకోవాలి 

రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్‌

పవన్‌కళ్యాణ్‌ ఇకనైనా ఈ తరహా వ్యాఖ్యలు మానాలి

మహిళలను అవమానపర్చే మాటలు మాట్లాడొద్దు

లేకపోతే మహిళలంతా తగిన బుద్ధి చెప్పితీరుతారు

కళ్యాణదుర్గం:  వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన టీడీపీ నేత నారా లోకేష్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ కోరారు. తాము తప్పు చేయటం గొప్ప అని పవన్‌ కల్యాణ్, తెలుగుదేశం పార్టీ... ఈ రెండూ ఒక లైన్‌ తీసుకున్నాయి. రెండు రోజుల క్రితం మంగళగిరిలో పవన్‌ కల్యాణ్‌ బూతుల ప్రసంగాన్ని చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేశ్‌ కూడా సమర్థించారు. చంద్రబాబు సమర్థించిన తరవాత, అదే లైన్‌లో ఎల్లో మీడియాలో డిబేట్లు నడిపారు. 
ఈ రోజున, తెలుగుదేశం పార్టీ పత్రిక, దాని పేరు చైతన్య రథం అట... ఆ పత్రికలో... అంటే టీడీపీ పత్రికలో... పవన్‌ కల్యాణ్‌ మాట్లాడితే బూతులు అవుతాయా... అంటూ టీడీపీ సమర్థించుకుంటూ రెండు పేజీల్లో కథనం రాశారు. పత్రిక టీడీపీది... జన సేనది కాదు. సమర్థన టీడీపీది... ఎందువల్ల? పవన్‌ బూతులు తిడితే టీడీపీ ఆ కార్యక్రమాన్ని వెనకేసుకు రావటం ఏమిటి? 

టీడీపీ వారే తిట్టించారా?:
    పవన్‌ కల్యాణ్‌తో ఈ బూతులు టీడీపీవారే తిట్టించారా? అందుకే దత్త పుత్రుడికి చంద్రబాబు తనయుడు లోకేశ్‌ నిన్న మద్దతు పలుకుతూ మరోసారి అలాంటి పదాలే ఉపయోగించారా?. ‘నా కొడుకులు’ అని పవన్, లోకేశ్, అయ్యన్న పాత్రుడు... ఇలా వీరంతా మాట్లాడుతున్నారు. వీరందరికీ తమ బిడ్డలమీద కోపం ఉన్నట్టుంది! 

చర్య తీసుకోవాలి:
    నిన్న లోకేశ్‌ మాట్లాడిన మాటలమీద రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్‌ శాఖ చర్యలు తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ మంత్రిగా డిమాండ్‌ చేస్తున్నాను. ఇదే సమయంలో, పవన్‌ కల్యాణ్‌ మీద కూడా చట్ట బద్ధంగా చర్యలు తీసుకోవాలని మహిళా–శిశు సంక్షేమ మంత్రిగా డిమాండ్‌ చేస్తున్నాను. 
    పవన్‌ కల్యాణ్‌ ఏం మాట్లాడుతున్నాడు?‘మూడు పెళ్ళిళ్ళు మీరూ చేసుకోండి... విడాకులు ఇచ్చి మీరు చేసుకోండి’’ అంటూ మాట్లాడుతున్నాడు. అంటే రెండు మూడు పెళ్ళిల్లు చేసుకోవాలని పిలుపు ఇస్తున్నారంటే, మహిళల మానంతో ఆడుకోవాలనా? మహిళల పట్ల మీకున్న గౌరవం ఇదేనా? అలాగే స్టెప్నీ అని కూడా పవన్‌ అన్నారు. అంటే పవన్‌ మహిళలను ఏ విధంగా అవమానపరుస్తున్నానేది తెలుస్తోంది.
    తాను చేసినది తప్పున్నర తప్పు అయితే... అదే పని మీరూ చేయండి అని పిలుపు ఇవ్వటం ఏమిటి? అందరినీ ‘నా కొడుకులు’ అని మాట్లాడటం ఏమిటి? ఇలాంటి విలువలు లేని నాయకుడికి సమర్థనగా టీడీపీ ప్రెస్‌మీట్లు పెట్టటం ఏమిటి? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు, లోకేశ్‌... ఈ ఇద్దరూ తమదీ అలాంటి విలువల వ్యవస్థే అన్నట్టు కామెంట్‌ చేయటం ఏమిటి? 

ఏమిటా వెకిలినవ్వు?:
    ఈ మధ్య ‘ఆహా’ అనే షోలో... తాను స్విమ్మింగ్‌ పూల్‌లో ఆడపిల్లలతో మందు, విందు చేసుకోవటంలో తప్పేమిటి అని నారా లోకేశ్‌... ఆ ఫొటోలను నిస్సిగ్గుగా సమర్థించుకోవటం ఏమిటి? అంతటితో ఆగిపోకుండా, ఆ ఫొటోలను చంద్రబాబుకు చూపించిన బాలకృష్ణ, దీని మీద మీ స్పందన ఏమిటి అని అడగటం ఏమిటి? దానికి సమాధానంగా చంద్రబాబు... మామకు లేని అభ్యంతరం నాకు ఏమిటి? అని వెకిలి నవ్వు నవ్వటం ఏమిటి? అంతే కాకుండా... అమ్మాయిల వ్యవహారాలు ‘‘మీరు సినిమాల్లో చేసిన దానికంటే నేను నిజ జీవితంలో ఎక్కువ చేశాను’’ అని చెప్పటం ఏమిటి? 

ఎక్కడైనా పోలిక ఉందా?:
    కోడలు కొడుకును కంటానంటే అత్త వద్దంటుందా?.. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా?.. బీసీల తోకలు కత్తిరిస్తా.. అన్న చంద్రబాబు ఎక్కడ?.
    అదే మహిళలకు అన్నింటా 50 శాతం ప్రాతినిథ్యం కల్పించిన జగన్‌గారు ఎక్కడ? అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అన్నింటా అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న జగన్‌గారు ఎక్కడ? పూలెగారి అడుగుజాడల్లో నడుస్తున్న జగన్‌గారు, మహిళలకు అన్నింటా అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే వారి పేరుతోనే ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. ఆయన అభినవ అంబేడ్కర్‌. అందుకే మహిళలంతా జగన్‌గారి వెంటే ఉన్నారు.

అందుకే దుష్ప్రచారం!:
    ఇది తెలుసు కాబట్టే, జగన్‌గారిపై రోజూ విమర్శలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియాలో ఎంత దుష్ప్రచారం చేసినా, వచ్చే ఎన్నికల్లో కూడా మా పార్టీదే విజయం. ఇది వాస్తవం. 
    మా ప్రభుత్వం ఎక్కడ, ఏ మంచి పని చేసినా, కార్యక్రమం తలపెట్టినా దాన్నించి ప్రజల దృష్టి మళ్లించే కుట్ర చేస్తున్నారు. మొన్న విశాఖలో గర్జన ర్యాలీ నిర్వహిస్తే, దాన్నించి దృష్టి మళ్లించేందుకే పవన్‌ ఈ డ్రామా చేశారు. కర్నూలులో న్యాయ రాజ«ధాని ఏర్పాటు చేస్తామంటే, మీరు రాయలసీమ వ్యతిరేకా? ఈ విషయం స్పష్టం చేయండి.

ఏం మెసేజ్‌ ఇవ్వదల్చుకున్నారు?:
    చంద్రబాబు, ఆయన కొడుకు ఈ సమాజానికి ఏం చెప్పదలచుకున్నారు? ఆడపిల్ల నచ్చితే అయితే ముద్దు పెట్టాలి... లేదంటే కడుపు చేయాలి... అన్న బాలకృష్ణ వాల్యూ సిస్టమ్‌ ఏమిటి? మొత్తంగా టీడీపీ టాప్‌ లీడర్ల మనసులే మహిళల విషయంలో పూర్తిగా కుళ్ళిపోయాయి! 
    ఇక పవన్‌ కల్యాణ్‌ అంతటి అరాచక వాది ప్రపంచంలో లేడు. తన దుర్మార్గాల్ని సమర్థించుకునేందుకు... మిగతా మగవారిని కూడా లాగి...  స్త్రీలను స్టెపినీలు అని సంబోధించిన దుర్మార్గుడు ప్రజా జీవితంలో ఉండటానికి అర్హుడా? అసలు వీరు రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉండటానికి అర్హులేనా? 

బుద్ధి చెబుతారు:
    ఇంకోసారి మహిళల పట్ల అసభ్య పదజాలం వినియోగిస్తే, వారిని అవమానపర్చినట్లు మాట్లాడితే, రాక్షసులను సంహరించిన దుర్గాదేవి మాదిరిగా మహిళలు తగిన బుద్ధి చెబుతారు. అందుకే పవన్‌కళ్యాణ్‌ ఇకనైనా ఈ తరహా వ్యాఖ్యలు విడనాడాలి. మహిళలను అవమానపర్చే విధంగా మాట్లాడొద్దు.

తాజా వీడియోలు

Back to Top