మంత్రి తానేటి వనితకు గాయాలు..

పశ్చిమ గోదావరి : జిల్లాలోని భీమడోలులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంత్రి కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ వెళ్తుండగా భీమడోలు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్కార్ట్‌ వాహనం తప్పించబోయిన మంత్రి వాహనం డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంత్రి వనితకు స్వల్ప గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Back to Top